జస్టిన్ బీబర్.. ఓ ఘాటుముద్దు!
యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరో సంచలనానికి తెరతీశాడు. తన కొత్త ప్రియురాలితో ఘాటు ముద్దుల్లో మునిగి తేలుతున్న ఫొటోను స్వయంగా బయటపెట్టాడు. ప్రస్తుతం ఆ ఫొటో బీబర్ కొత్త ఆల్బమ్ కంటే ఎక్కువ కిక్కిస్తుంది అభిమానులకి!. 21 ఏళ్ల యువ సంచలనం బీబర్..మోడల్ అయిన 19 ఏళ్ల హెయిలీ బాల్డ్విన్ ను ముద్దాడుతున్న ఫొటోను బ్లర్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
సెయింట్ బార్ట్స్ గేట్ వే లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఈ జంట పాల్గొంది. ఈ ముద్దు, ముచ్చట్లన్నీ ఆ వేడుకల్లోనివే. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న మరిన్ని ఫొటోలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నాళ్లు మేం కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకుంటున్న ఈ జంట ఇప్పుడు కొంత క్లారిటీ ఇచ్చినట్టే !