తాగుడు, డ్రగ్స్ మానేసిన కుర్ర సింగర్? | Justin Bieber quits drink and drugs? | Sakshi
Sakshi News home page

తాగుడు, డ్రగ్స్ మానేసిన కుర్ర సింగర్?

Published Mon, Feb 2 2015 8:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

తాగుడు, డ్రగ్స్ మానేసిన కుర్ర సింగర్?

తాగుడు, డ్రగ్స్ మానేసిన కుర్ర సింగర్?

యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ మద్యపానం, డ్రగ్స్ సేవనం మానేశాడట. 'బేబీ' ఆల్బంతో ఒక్కసారిగా తారాపథానికి వెళ్లిపోయి, చిన్న వయసులోనే భారీగా సంపాదించేసిన ఈ కుర్రోడు.. తర్వాత చాలాసార్లు వివాదాల్లో మునిగిపోయాడు. పుట్టినరోజు వేడుకల్లో పూటుగా తాగి రోడ్డుమీద గొడవ చేయడం, స్నేహితురాళ్లతో పదే పదే బ్రేకప్ అవ్వడం.. ఇలాంటివి అతగాడికి సర్వసాధారణంగా మారిపోయాయి.

అయితే, అతడి వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ను కూడా మళ్లీ గాడిలో పెట్టడానికి బీబర్కు అన్నీ తానే అయిన కార్ల్ నడుంకట్టారు. చివరకు తొలి అడుగుగా మద్యపానం, డ్రగ్స్ సేవనం మానేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకుముందు కూడా బీబర్ మద్యం మానేస్తానని చెప్పినా, ఈసారి మాత్రం నిజంగానే మానేశాడని అంటున్నారు. జస్టిన్ బీబర్ తనకు తాను దారిలో పెట్టుకుంటే తప్ప.. అతడి కెరీర్ బాగుపడే లక్షణాలు లేవని బీబర్ మేనేజర్ స్కూటర్ బ్రాన్ కూడా అన్నారు.  ఆ తర్వాత.. బీబర్ తన ఫేస్బుక్ పేజీలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. గతంలో తాను పొగరుగా ప్రవర్తించినందుకు క్షమించాలని కూడ అందులో కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement