
సచిన్ కుమారుడు అర్జున్‌కు ఏమైంది..!
ముంబయి: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెందూల్కర్‌కు ఏమైంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం.. ముంబైలో పాప్ సంచలనం జస్టిస్ బీబర్ షోకు అర్జున్ ఊతకర్రలతో నడస్తూ రావడమే. గాయాలు వేధిస్తున్నా అర్జున్ బీబర్ ఈవెంట్‌కు హాజరవడానికి కారణం లేకపోలేదు. భారతీయులు అర్జున్‌ను ముద్దుగా ఇండియన్ జస్టిన్ బీబర్‌గా పిలుచుకుంటారు. అర్జున్ ఎడమకాలుకు బ్యాండేజీతో కనిపించాడు. దీంతో బీబర్‌కు ఏమైందా అని కంగారుపడ్డారు.
స్టేజీపై బీబర్‌ను చూసి ఇతడు అర్జున్ అని గుర్తించాక వారి ఆందోళన మరి ఎక్కువైంది. బయటకు రాకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇండియన్ బీబర్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా అర్జున్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో నేవీ ముంబైలోని డీవై పాటిల్ స్డేడియంలో ఏర్పాటుచేసిన బీబర్ ఈవెంట్‌కు అర్జున్ రావడంతో సచిన్ అభిమానులతో పాటు బీబర్ ఫ్యాన్స్ కూడా ఇద్దరు బీబర్స్‌ను ఒకేసారి చూసే అవకాశం దొరికింది. ఆపై ట్విట్టర్లో తమ కామెంట్ల వర్షం కురిపించారు. లిప్ సింక్ సరిగాకాలేదని నిరాశ చెందిన బీబర్ ఫ్యాన్స్.. అర్జున్ టెండూల్కర్ స్టేజీపై ఉన్నాడేమోనని కొందరు ట్వీట్ చేయగా.. అర్జున్ అయితే ఇంకా బాగా లిప్ సింగ్ చేసేవాడని ట్వీట్లు చేశారు.
Arjun Tendulkar, #SachinTendulkar's son might just be India's craziest Belieber! He went for the concert on crutches pic.twitter.com/QygFLLyHUX
— Jinnions (@jinnions) 11 May 2017
Desi Justin Bieber (Arjun Tendulkar) at Justin Bieber's #PurposeTourIndia concert. Apne pass Justin Tendulkar hai.