సచిన్‌ కొడుకు ఎవరి పోలికో తెలుసా? | netizens compare Arjun Tendulkar with Justin Bieber | Sakshi
Sakshi News home page

సచిన్‌ కొడుకు ఎవరి పోలికో తెలుసా?

Published Tue, Sep 27 2016 6:50 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

సచిన్‌ కొడుకు ఎవరి పోలికో తెలుసా?

సచిన్‌ కొడుకు ఎవరి పోలికో తెలుసా?

జస్టిన్ బీబర్‌ ముంబై ఎందుకొచ్చాడు? అతను సచిన్‌ను ఎందుకలా పట్టుకున్నాడు? ఈ ఫొటోను చూసి ఓ నెటిజన్‌ వ్యక్తం చేసిన సందేహం ఇది. నిజానికి ఆ నెటిజనే కాదు చాలామంది లెటెస్ట్‌ లుక్‌లో ఉన్న అర్జున్‌ టెండూల్కర్‌ను చూసి అతను జస్టిన్‌ బీబరేమోనని పొరపడ్డారు. అందుకు కారణం లేకపోలేదు. కెనడియన్‌ పాప్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ జస్టిన్‌ బీబర్‌ పోలికలు అర్జున్‌లో కొన్ని ఉండటమే.

క్రికెట్‌ లెంజడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ కొడుకైన అర్జున్‌ టెండుల్కర్‌ ఇటీవలే 17వ వసంతంలో అడుగుపెట్టాడు. సెప్టెంబర్‌ 24న తన ఇంట్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తండ్రితో అర్జున్‌ దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. తండ్రి బాటలోనే క్రికెట్‌ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న అర్జున్‌ ఫొటోను చూసిన చాలామంది నెటిజన్లు థ్రిల్‌ అయ్యారు. ఈ ఫొటో చూసిన చాలామంది మొదట బీబర్‌ అనుకున్నారంటే ఎంత అచ్చుగుద్దినట్టు పోలికలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకొంతమంది నెటిజన్లైతే.. బీబర్‌, అర్జున్‌ చిన్నప్పుడే తప్పిపోయిన సోదరులు అయి ఉంటారని, సినిమాలోలాగా వాళ్లు మళ్లీ కలుసుకోవచ్చంటూ చమత్కరించారు. ఇంకొందరు సురేశ్‌-రమేశ్‌ అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement