
నా జీవితం సులువు కాదు: జస్టిన్ బీబర్
లాస్ ఏంజెలెస్: గత జీవనయానంలో తన జీవితం అంత సులువుగా సాగలేదని పాప్ సంగీత సంచలనం జస్టిన్ బీబర్(21) పేర్కొన్నాడు. ఉర్రూతలూగించే పాప్ మ్యూజిక్ తో చిన్నవయసులోనే మల్టీమినియనీర్ గా ఎదిగిన అతగాడు కొన్నేళ్లుగా వివాదాలతో సావాసం చేస్తున్నాడు.
అయితే ఇప్పుడిప్పుడే వివాదాల నుంచి బయటపడుతున్నానని యూఎస్ఏ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీబర్ చెప్పాడు. ఇప్పుడు తనచుట్టూ మంచి మనుషులు ఉన్నారని, వారందరూ తనకు అండగా ఉంటారని తెలిపాడు. దీంతో ఇప్పుడు తన జీవితం సాఫీగా సాగుతోందన్నాడు. తన జీవనయానంలోకి ఎంతో మంది వచ్చి వెళ్లారని వెల్లడించాడు. 'బేబీ' హిట్ మేకర్ ఇప్పుడు తన నాలుగో ఆల్బం విడుదల చేసే పనిలో నిమగ్నమయ్యాడు.