
'అతడు నా లవర్ కాదు'
లాస్ ఎంజిలిస్: యువ సంచలనం జస్టీస్ బీబర్ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. జస్టీస్ బీబర్ తన బాయ్ ఫ్రెండ్ కాదంటూ అతని ప్రియురాలు, మోడల్ అయిన 19 ఏళ్ల హెయిలీ బాల్డ్విన్ స్పష్టం చేసింది. దాంతో పాటు రిలేషన్ షిప్స్ చాలా కఠినంగా ఉంటాయంటూ వేదాంతం చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరూ ఏదో ఓ సందర్భంలో తమకు నచ్చినవాళ్లతో గడుపతారని, అయితే అందరూ అనుకున్నట్లుగా మేం లవర్స్ కాదని వివరించింది. యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఇటీవల తన కొత్త ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలా సందర్భాల్లో కనిపించిన మాట వాస్తవమే. 21 ఏళ్ల యువ సంచలనం బీబర్.. మోడల్ అయిన హెయిలీ బాల్డ్విన్ ను ఘాటుగా ముద్దాడుతున్న ఫొటోను బ్లర్ చేసి గత నెలలో తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఓ క్లారిటీ ఇచ్చారని అభిమానులు సంబరపడ్డారు.
బీబర్ కొత్త ఆల్బమ్ కంటే ఆ సింగర్ అభిమానులు ఎక్కువగా మోడల్ కు ముద్దిస్తూ దిగిన ఫొటో పోస్ట పైనే తమ దృష్టిసారించారు. సెయింట్ బార్ట్స్ గేట్ వే లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఈ జంట పాల్గొంది. ఈ ముద్దు, ముచ్చట్లు, రొమాన్స్ అన్నీ ఆ వేడుకల్లో భాగంగా వారిద్దరి మధ్య నడిచాయి. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న మరిన్ని ఫొటోలు నెట్లో చక్కర్లు కొడుతున్న తరుణంలో బీబర్ తన బాయ్ ఫ్రెండ్ కాదని మోడల్ హెయిలీ బాల్డ్విన్ అంటోంది.