న్యూజిలాండ్ హోటల్ లో జస్టిన్ బీబర్ కు చేదు అనుభవం
టీనేజ్ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ కు కష్టాలు వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ లోని అక్లాండ్ పట్టణంలో పాప్ సంచలనానికి చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి ఇబ్బందులకు గురిచేయనని కాంట్రాక్టుపై సంతకం చేసిన తర్వాతనే హోటల్ లో ఉండటానికి మేనేజ్ మెంట్ అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా తన సూట్ లోనికి అమ్మాయిలను తీసుకురాకూడదు, విలాసవంతమైన సమావేశం మందిరంలో తినకూడదు అనే షరతులను కూడా విధించిందని బ్రిటన్ వార్త పత్రిక కథనాన్ని వెల్లడించింది.
హోటల్ లో విడిది చేసే అతిధులకు, యాజమాన్యానికి ఎలాంటి సమస్యలు కలిగించకూడదని ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. తమ హోటల్ లో బస చేసే వారికి ఎలాంటి హోదాలో ఉన్నా పట్టింపులేదని.. తమ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాలని పాప్ స్టార్ బీబర్ కు హోటల్ యాజమాన్యం స్పష్టం చేసిందని కథనంలో తెలిపింది.
అంతర్జాతీయంగా గొప్ప పేరు, ఫాలోయింగ్ ఉన్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్ బ్రెజిల్ లోని రియో డి జెనిరోలో ఓ వేశ్యాగృహంలోని ఓ వేశ్య గృహంలో మీడియా కంటపడటం అక్కడి అభిమానుల ఆగ్రహానికి గురి చేసింది.