లాస్ ఏంజెల్స్: పాప్ సెన్సేషనల్ జస్టిన్ బీబర్కు అవార్డుల పంట పండింది. బీబర్ అందుకున్న అవార్డుల్లో ఒకటి మేల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అయితే ఇంకొటి బెస్ట్ ఫ్యాన్ ఆర్మీ ప్రైజ్.. దీంతో గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బీబర్కు ఊరట లభించింది. కాలిఫోర్నియాలో జరిగిన ఐ హార్ట్ రేడియో అవార్డుల ప్రధానోత్సవంలో బెస్ట్ మేల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గత ఏడాది చేసిన స్పిరుచ్యువల్ ఆల్బమ్ కి అందుకున్నాడు బీబర్.
అవార్డును అందుకునేందుకు వేదిక పైకి వెళుతూనే.. 'థ్యాంక్స్ గాడ్! ఇప్పటివరకు చాలా కఠిన సమయాలను చూశాను. అవన్నీ ఎదుగుదలలో నేర్చుకునేందుకేనని తెలుసు' అని భగవంతుడికి ధన్యవాదాలు తెలిపాడు. ఆల్బమ్ల మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతుండటంతో కుటుంబసభ్యులతో గడపడానికి వీలు చిక్కడం లేదని, తన చెల్లెలు, తమ్ముడు త్వరగా ఎదుగుతున్నారని బీబర్ అన్నాడు.
ఇది దేవుడి దయే: బీబర్
Published Tue, Apr 5 2016 9:18 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
Advertisement
Advertisement