
చప్పట్లు సరిగ్గా కొట్టలేదని కచేరి ఆపేశాడు!
పాప్ యువ సంచలనం జస్టిన్ బీబర్ మరోసారి వింతగా ప్రవర్తించాడు. తాను పాడుతున్నప్పుడు.. ఆ బీట్‌కు అనుగుణంగా ప్రేక్షకులు చప్పట్లు కొట్టలేదనే వింత కారణంతో ఈ సింగర్ మధ్యలోనే మ్యూజిక్ కన్సర్ట్‌ను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయాడు. దీంతో నివ్వెరపోవడం ప్రేక్షకుల వంతయింది. గత నెల 28న స్పెయిన్‌లో జస్టిన్ బీబర్ సంగీత కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది. గతంలోనూ ఓసారి ఇదేవిధంగా పెద్దగా కారణాలు లేకుండానే జస్టిన్ బీబర్ మధ్యలోనే కన్సర్ట్ ఆపేశాడు.
స్పెయిన్‌లో మ్యూజిక్ కన్సర్ట్‌లో జస్టిన్ 'వాట్ డూ యూ మీన్' పాటపాడుతూ.. పాట బీట్‌కు అనుగుణంగా చప్పట్లు కొట్టమని ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. అతను ఇలా రెండు, మూడుసార్లు చెప్పి.. కనీసం మీరు బీట్‌కు అనుగుణంగా చప్పట్లు కొట్టడం లేదు.. ఆపండి అంటూ ప్రేక్షకులపై అరిచాడు. ఇంకా నేనెందుకు పాడాలి అనుకున్నాడేమో పాట మధ్యలోనే అతను వేదిక దిగిపోయాడు.