
నన్ను శాసించే గర్ల్ ఫ్రెండ్ అక్కర్లేదు!
లండన్:టీనేజ్ పాప్ సంచలనం జస్టిన్ బీబర్(21) మరొ కొత్త గర్ల్ ఫ్రెండ్ అన్వేషణలో పడ్డాడు. ఇప్పటికే గోమెజ్, మోడల్ హేలీ బాల్ద్ విన్, టీవీ స్టార్ కెండల్ జెన్నర్ తో ప్రేమాయణం సాగించి తెగతెంపులు చేసుకున్న బీబర్.. ఇక తన జీవితంలోకి వచ్చే గర్ల్ ఫ్రెండ్ నమ్మదగిన వ్యక్తిగా ఉండాలంటున్నాడు. ఈ మేరకు తన తదుపరి ప్రేయసికి ఉండే లక్షణాల జాబితాను బీబర్ ప్రకటించాడు.
'నా గర్ల్ ఫ్రెండ్ నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి. నీతి నిజాయితీగా ఉండాలి. అందంగా కూడా ఉండాలి'అని పేర్కొన్నాడు. కాగా, తనను శాసించే భాగస్వామి అయితే తనకు అక్కర్లేదని పేర్కొన్నాడు. తాను ప్రజలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు బీబర్ తెలిపాడు.