సింగర్ను దెప్పిపొడిచిన పాప్ సింగర్ | Justin Bieber taunts Taylor Swift | Sakshi
Sakshi News home page

సింగర్ను దెప్పిపొడిచిన పాప్ సింగర్

Published Wed, Aug 3 2016 4:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

సింగర్ను దెప్పిపొడిచిన పాప్ సింగర్

సింగర్ను దెప్పిపొడిచిన పాప్ సింగర్

లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ సోషల్ మీడియాలో లేడీ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ను దెప్పిపొడిచాడు. ఓ వీడియోలో అతడి ఫొటోను, ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ కాల్విన్ హ్యారిస్, ర్యాపర్ కెన్యె వెస్ట్ ది, టేలర్ ఫొటోను ఇన్ స్టాగ్రమ్ లో పెట్టి ఇప్పుడేం జరిగింది అని ప్రశ్నిస్తున్నట్లు ఓ ట్యాగ్ లైన్ తో పోస్ట్ చేశాడు.

అయితే, అసలు అతడి ఉద్దేశం ఏమిటనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. కాగా, గత కొన్నాళ్లుగా స్విప్ట్ కు బీబర్ కు వివాదాలు ఉన్నాయి. టేలర్ సలహాలు విన్నతర్వాతే బీబర్ మాజీ ప్రియురాలు సెలెనా గోమెజ్ అతడిని పక్కకు పెట్టిందట. ఈ నేపథ్యంలో ఆమెను అవమానించేందుకే టేలర్ మాజీ బాయ్ ఫ్రెండ్ ఫొటోను పోస్ట్ చేశాడని పలువురు చెవులుకొరుక్కుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement