బీబర్ ఇంటినుంచి మారిజువానా కంపు!! | Marijuana smell from Justin Bieber place disturbs neighbours? | Sakshi
Sakshi News home page

బీబర్ ఇంటినుంచి మారిజువానా కంపు!!

Published Wed, Jun 25 2014 12:35 PM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

బీబర్ ఇంటినుంచి మారిజువానా కంపు!! - Sakshi

బీబర్ ఇంటినుంచి మారిజువానా కంపు!!

యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ఇంట్లోంచి భారీగా మారిజువానా కంపు వస్తుండటంతో ఇరుగుపొరుగులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు బీబర్ ఇంటి నుంచి శబ్దం కూడా బాగా ఎక్కువగా వస్తోందని అంటున్నారు. బీబర్ తన ఇంట్లో ఓ పార్టీ ఇవ్వడంతో దాన్నుంచి చాలా ఎక్కువగా దుర్వాసన వచ్చిందని చుట్టుపక్కల వాళ్లు ఫిర్యాదు చేశారు.

తన ఇంటి హాల్లోకి కూడా చాలా ఎక్కువగా మారిజువానా వాసన వచ్చిందని ఇదంతా బీబర్ ఇంటి నుంచేనని పక్కింటి వ్యక్తి ఒకరు ఫిర్యాదు చేశారు. లాస్ ఏంజెలిస్లో తన పర్యటన ఉండటంతో బీబర్ ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల మొదట్లోనే ఆ ఇంట్లోకి వెళ్లాడు. అప్పటి నుంచి రెండు సార్లు బీబర్ గురించి ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement