టుస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్ శిల్పం
సిడ్నీ: సిడ్నీలోని డార్లింగ్ హార్బర్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్‌లో బాలీవుడ్ నట దిగ్గజం 71 ఏళ్ల అమితాబ్ బచ్చన్ మైనపు శిల్పాన్ని ఏర్పాటు చేయనున్నారు. బచ్చన్‌కు దక్కిన జీవిత సాఫల్య పురస్కారాల్లో ఇది అరుదైన పురస్కారమవుతుందని భావిస్తున్నట్టు టుస్సాడ్స్ జీఎం క్విన్ క్లార్క్ పేర్కొన్నారు. కాగా, బాలీవుడ్ నటులు కరీనా కపూర్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్‌ల మైనపు శిల్పాలు ఇప్పటికే ఇక్కడ కొలువుదీరాయి.