ఇట్స్‌ సాహో టైమ్‌ | Prabhas measurements taken for wax statue at Madame Tussauds | Sakshi
Sakshi News home page

ఇట్స్‌ సాహో టైమ్‌

Published Thu, Jun 8 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

ఇట్స్‌ సాహో టైమ్‌

ఇట్స్‌ సాహో టైమ్‌

ప్రభాస్‌ ఇప్పుడు ఫుల్‌ కూల్‌గా ఉన్నారు. దాదాపు నెల రోజులుగా యూఎస్‌లో హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేశారు. కొత్త ఉత్సాహంతో ఇండియా వచ్చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ త్వరలో ‘సాహో’ షూటింగ్‌లో పాల్గొంటారు. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం టీజర్‌లో ప్రభాస్‌ ‘ఇట్స్‌ షో టైమ్‌’ అన్నారు. ఇప్పుడు పూర్తిగా ఈ చిత్రానికే డెడికేట్‌ కాబోతున్నారు కాబట్టి, ‘ఇట్స్‌ సాహో టైమ్‌’ అనాలి.

ఆ సంగతలా ఉంచితే.. ప్రభాస్‌ తననెవరూ గుర్తుపట్టకూడదని యూఎస్‌లో ఉన్నప్పుడు గడ్డం, మీసాలు తీసేశారట. హ్యాపీగా హాలిడేస్‌ను ఎంజాయ్‌ చేసి, హైదరా బాద్‌లో వచ్చారు. ఆయన అభిమానులు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే, బ్యాంకాక్‌లోని ‘మేడమ్‌ తుస్సాడ్స్‌’లో ప్రభాస్‌ ‘బాహుబలి’ మైనపు బొమ్మను పెట్టారు. ఆ మధ్య ఈ బొమ్మ కోసం అక్కడివాళ్లు ఇక్కడికొచ్చి ప్రభాస్‌ కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement