రాజమౌళి ఆ రహస్యం చెప్పేశాడు
శుక్రవారం బాహుబలి టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అక్టోబర్ 5న ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడిస్తానంటూ చెప్పాడు దర్శకుడు రాజమౌళి. ఆ విషయం ఏమై ఉంటుంది అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కొంత మంది అది ప్రభాస్ పెళ్లి వార్తే అని ఫిక్స్ అయ్యారు కూడా. అయితే అనుకున్నసమయానికన్నా ముందే రాజమౌళి ఆ రహస్యాన్ని వెల్లడించాడు.
'ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వార్తని ఎక్కువగా కాలం దాచి పెట్టలేం, అందుకే 5వ తారీఖున చెప్పాల్సిన వార్త ఇవాళే చెప్పేస్తున్నా. మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ గౌరవం దక్కిన తొలి దక్షిణాది నటుడు ప్రభాస్. ప్రభాస్ విగ్రహాన్ని 2017 మార్చిలో బ్యాంకాక్లో ఆవిష్కరిస్తారు' అంటూ ట్వీట్ చేశాడు.
Guess its impossible to keep the news under wraps nowadays.:)
— rajamouli ss (@ssrajamouli) 1 October 2016
Revealing the good news today itself.
Very happy to announce that Madame Tussauds is making a wax statue of our PRABHAS..
— rajamouli ss (@ssrajamouli) 1 October 2016
First South Indian to be honoured thus.
The statue will be unvieled at Bangkok in March 2017 and subsequently will be toured all over the world.
— rajamouli ss (@ssrajamouli) 1 October 2016