అమితాబ్కు మరో అరుదైన గౌరవం | Madame Tussauds Sydney to get Amitabh Bachchan's wax figure | Sakshi
Sakshi News home page

అమితాబ్కు మరో అరుదైన గౌరవం

Published Tue, Aug 5 2014 1:01 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

అమితాబ్కు మరో అరుదైన గౌరవం

అమితాబ్కు మరో అరుదైన గౌరవం

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. సిడ్నీలోని మేడమ్ టస్సాడ్స్ మ్యూజియంలో అమితాబ్ మైనపు బొమ్మను ఈ ఏడాది చేర్చబోతున్నారు. ఈ విషయాన్ని మ్యూజియం వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. దీంతో కెప్టెన్ కుక్, డాన్ బ్రాడ్మన్, నికోల్ కిడ్మన్, హగ్ జాక్మన్, జానీ డెప్, లేడీ గాగాల సరసన అమితాబ్ మైనపు బొమ్మ కూడా చేరబోతోంది. ఈ బొమ్మను ఇంటరాక్టివ్ సెట్టింగ్లో పెట్టబోతుండటంతో అభిమానులు దానికి సమీపంగా వెళ్లి స్వయంగా అమితాబ్ను కలిసిన అనుభూతిని కూడా పొందేందుకు అవకాశం ఉంటుంది.

ఇందులో మరో విశేషం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పోల్ నిర్వహించి, ఈసారి టస్సాడ్స్ మ్యూజియంలో ఏ సెలబ్రిటీ బొమ్మ పెట్టాలని అడిగితే, ఎక్కువ మంది అమితాబ్నే ఎన్నుకున్నారట. ఈ విషయాన్ని మ్యూజియం జనరల్ మేనేజర్ క్విన్ క్లార్క్ ప్రకటించారు. ఇప్పటికే జీవితకాల సాఫల్యాన్ని సాధించిన అమితాబ్ బచ్చన్ విగ్రహం పెట్టడం మ్యూజియానికే గౌరవం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement