ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్, గీతా కపూర్, నటి మలైకా అరోరా సోనీ ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్స్‌ర్’ షోకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నటి మలైకా కరోనా బారిన పడటంతో ఆమె స్థానంలో ప్రముఖ డ్యాన్స్ నోరా ఫతేహి న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ క్రమంలో కొరియోగ్రాఫర్ టెరెన్స్, డ్యాన్సర్ నోరాతో అనుచితంగా ప్రవర్తించాడని వార్తలు వినిపించాయి. ఇద్దరు కలిసి స్టేజ్‌పై నృత్యం చేస్తుండగా నోరాను అభ్యంతకరంగా తాకినట్లు ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. చదవండి: ఇద్దరు ముద్దుగుమ్మల డాన్స్.. అదుర్స్
తాజాగా ఈ వీడియోపై టెరెన్స్ లూయిస్ స్పందించాడు. అది అసలైన వీడియో కాదని, మార్ఫింగ్ చేసిన వీడియోనని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నోరాపై తనకు చాలా గౌరవం ఉందని పేర్కొన్నాడు. ఒకవేళ ఈ క్లిప్ వాస్తవమైతే నోరా ఎందుకు స్పందించకుండా ఉంటుందని అన్నాడు. ఆడవాళ్లపై అమిత గౌరవం ఉందని, ఇలాంటి చెడు పనులు జీవితంలో చేయలేదని, చేయనని పేర్కొన్నాడు. ఇలా చేయడానికి తనేం 17 ఏళ్లలో లేనని తన వయస్సు 45 సంవత్సరాలని క్లారిటీ ఇచ్చాడు. కాగా ప్రస్తుతం కరోనా నుంచి కోలుకొని నటి మలైకా తిరిగి డ్యాన్స్‌షో సెట్లో అడుగు పెట్టారు. చదవండి: సినిమాలకు 'కత్తి' హీరోయిన్ గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment