Nora Fathehi New Song Kusu Kusu Out from Satyameva Jayathi 2 movie - Sakshi
Sakshi News home page

Kusu Kusu Song: మరోసారి కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో నోరా ఫతెహీ

Published Wed, Nov 10 2021 12:22 PM | Last Updated on Wed, Nov 10 2021 12:32 PM

Nora Fathehi New Song Kusu Kusu Out - Sakshi

నోరా ఫతేహీ.. ఈ పేరు విం​‍​టే చాలు అందరికీ గుర్తు వచ‍్చేది దిల్‌బర్‌ సాంగ్‌. ఆ పాటలో తన హావాభావాలతో యువతను ఎలా పిచ్చెక్కించిందో చూశాం. ఇప్పుడు మళ్లీ కుర్రకారు మదిని కొల్లగొట్టేందుకు కొత్త సాంగ్‌తో వచ్చేసిందీ డ్యాన్స్‌ క్వీన్‌. బాలీవుడ్‌ యాక్టర్‌ జాన్‌ అబ్రహమ్‌ అప్‌కమింగ్‌ మూవీ సత్యమేవ జయతే 2 లోని 'కుసు కుసు' సాంగ్‌ ఇవాళ విడుదలైంది. ఈ పాటలో నోరా తన అందం, కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, సొగసైన బెల్లీ డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 

సత్యమేవ జయతే 2 లోని మేరీ జిందగీ హై తూ పాట తర్వాత నిర‍్మాతలు నోరా ఫతేహీ నటించిన కుసు కుసు సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. జారా ఎస్‌ ఖాన్‌, దేవ్‌ నేగీలు పాడిన ఈ పాటకు తనిష్క్‌ బగ్చీ లిరిక్స్‌ రాశారు.  2018లో వచ్చిన సత్యమేవ జయతే భారీ సక్సెస్ తర్వాత జాన్‌ అబ్రహమ్‌తో సీక్వెల్‌ తీశారు. అన్యాయం, అధికార దుర్వినియోగంపై పోరాటమే సత్యమేవ జయతే 2 కథ. 'ఈసారి యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రెట్టింపు అవుతుంది' అని జాన్ అబ్రహమ్‌ తన ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేశారు. 

మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్‌ పిల్లయ్‌, అనూప్‌ సోనీ, సాహిల్‌ వాయిద్‌ నటిస్తున్నారు. నవంబర్‌ 25న సత్యమేవ జయతే 2 సినిమా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement