సీక్వెల్‌ షురూ | Milap Zaveri announces John Abraham Satyameva Jayate2 for Gandhi Jayanti 2020 | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌ షురూ

Published Sat, Sep 28 2019 2:15 AM | Last Updated on Sat, Sep 28 2019 2:15 AM

Milap Zaveri announces John Abraham Satyameva Jayate2 for Gandhi Jayanti 2020 - Sakshi

యాక్షన్‌ హీరో ఇమేజ్‌ ఉన్న బాలీవుడ్‌ టాప్‌ హీరోలలో జాన్‌ అబ్రహాం ఒకరు. పోలీసాఫీసర్‌గా జాన్‌ నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమా గత ఏడాది  పంద్రాగస్టుకు విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి హిట్‌ సాధించింది. జాన్‌ కెరీర్‌కు మంచి మైలేజ్‌ ఇచ్చిన చిత్రం ఇది. మిలాప్‌ జవేరి దర్శకడు. తాజాగా ‘సత్యమేవ జయతే’ సీక్వెల్‌ను అనౌన్స్‌ చేశారు జాన్‌ అబ్రహాం. తొలి పార్ట్‌కు దర్శకత్వం వహించిన మిలాప్‌నే రెండో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్య కౌశల కుమార్‌ ప్రధాన పాత్రధారి. ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబరు 2న విడుదల చేయనున్నట్లు జాన్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement