హలో, మెడల్‌ సాధించినట్లు ఆ పోజేంటి?.. హీరోపై ఆగ్రహం | Netizens Do not Like John Abraham Touching Manu Bhaker Medal | Sakshi
Sakshi News home page

ఆమె సాధించిన పతకం.. నీకే అర్హత ఉందని టచ్‌ చేస్తున్నావ్‌? హీరోపై నెటిజన్ల ఫైర్‌

Published Thu, Aug 8 2024 9:19 AM | Last Updated on Thu, Aug 8 2024 11:07 AM

Netizens Do not Like John Abraham Touching Manu Bhaker Medal

ఒలంపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత స్టార్‌ షూటర్‌ మనూ భాకర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒలపింక్స్‌లో విజయకేతనం ఎగురవేసిన ఆమె ఇండియాకు తిరిగొచ్చింది. ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం ఆమెను ‍స్వయంగా కలిసి అభినందించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

ఒలంపిక్‌ పతకంతో హీరో
అందులో జాన్‌, మనూ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అయితే జాన్‌ అబ్రహం మను సాధించిన ఓ పతకాన్ని తన చేతితో పట్టుకుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది నెటిజన్లకు మింగుడుపడలేదు. ఆమె కష్టపడి సాధించిన పతకాలను తాకే అర్హత ఎవరికీ లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కరెక్ట్‌ కాదు
'తను భారత్‌ గర్వపడేలా చేసింది. ఆమెను కలిసే అవకాశం వచ్చినందుకు సంతోషపడాలి. కానీ ఇలా తన పతకంతో ఫోజివ్వడం కరెక్ట్‌ కాదు..', 'ఒకరు సాధించిన మెడల్‌ను తాకే హక్కు నీకు లేదు, సారీ..', 'ఆ పతకం నువ్వు సాధించినట్లే బిల్డప్‌ ఇస్తున్నావేంటి?'

అది నీ కష్టఫలం
'ఆమెకు రెండు చేతులున్నాయిగా.. మరి నువ్వెందుకు పట్టుకోవడమో..', 'మనూ.. నువ్వు సాధించిన పతకాన్ని ఎవరి చేతికీ ఇవ్వకు.. అది నీ కష్టానికి దక్కిన ప్రతిఫలం' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ 'వేద'. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement