
Nora Fatehi Hot Dance Video Goes Viral In The Internet: బాలీవుడ్ దివా, డ్యాన్స్ క్వీన్ నోరా ఫతేహి తన అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. తను వేసుకునే ఫ్యాషన్ వేర్స్, హాట్ డ్యాన్స్, కైపెక్కించే హావాభావాలు, అందంతో ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. ఇటీవల విడుదలైన 'సత్యమేవ జయతే 2' చిత్రంలోని 'కుసు కుసు' సాంగ్‌లో ఎక్స్‌ప్రెషన్స్, బెల్లీ డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసింది. అలాగే బ్లూ బికినీ టాప్‌లో చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ వీడియో తెగ వైరల్ అయింది. అలాగే ఏయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోలతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసిందీ మనోహరి. తాజాగా నోరా ఫతేహి తన కిల్లర్ డ్యాన్స్ కదలికలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ఒక ఏయిర్‌పోర్ట్ ప్రాంతంలో కారులో తన హిట్ ట్రాక్ 'కుసు కుసు' పాటకు స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో నోరా బ్లాక్ డ్రెస్ ధరించి ప్రముఖ కొరియోగ్రాఫర్ అవేజ్ దర్బార్‌తో కలిసి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేయడం చూడొచ్చు. డ్యాన్స్ చేసేటప్పుడు తన కదలికలు, ఎక్స్‌ప్రెషన్స్ వావ్ అనిపిస్తున్నాయి. అలాగే బ్లాక్ డీప్-నెక్ టాప్‌తో మ్యాచింగ్ బ్లాక్ లెదర్ ప్యాంట్ ధరించి ఆకర్షిస్తోందీ బెల్లీ డ్యాన్స్ క‍్వీన్. ఈ బ్యూటీ 'టెంపర్', 'బాహుబలి: ది బిగెనింగ్' సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నృత్యం చేసి ఆకట్టుకుంది.