అప్పుడు ఐటం సాంగ్... ఇప్పుడు స్పెషల్ సాంగ్ | Nora Fatehi lands special song in 'Baahubali' | Sakshi
Sakshi News home page

అప్పుడు ఐటం సాంగ్... ఇప్పుడు స్పెషల్ సాంగ్

Published Fri, Mar 27 2015 4:55 PM | Last Updated on Sun, Jul 14 2019 4:18 PM

అప్పుడు ఐటం సాంగ్... ఇప్పుడు స్పెషల్ సాంగ్ - Sakshi

అప్పుడు ఐటం సాంగ్... ఇప్పుడు స్పెషల్ సాంగ్

హైదరాబాద్: టాలీవుడ్ చిత్రాలను శిల్పాలుగా చెక్కాలంటే జక్కన అదేనండి ఎస్ ఎస్ రాజమౌళి తర్వాతే ఎవరైనా?  ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించే అవకాశం వచ్చిందంటే ఎగిరిగంతులు వేయాల్సిందే. ఇప్పుడు ఆ అవకాశం నోరా ఫతేహికు వచ్చింది. ప్రభాస్ హీరోగా దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ... వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న  బాహుబలి చిత్రంలో నటించనుంది.

అది కూడా ఆ చిత్రంలోని స్పెషల్ సాంగ్లో నటించనుంది. త్వరలో ఆ పాటకు సంబంధించిన షూటింగ్ పనులు హైదరాబాద్లో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి హైదరాబాద్కు డ్యాన్స్ చేసేందుకు వస్తున్నాను అంటూ నోరా ఫతేహి గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement