వర్మ అరెస్టు... కేసు ఛేదించిన పోలీసులు
సంచనలం రేపిన బాహుబలి సినిమా సీన్స్ లీకేజీ కేసును పోలీసులు ఛేదించారు. లీకేజీకి సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. గతంలో మకుట విజువల్స్ ఎఫెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన వర్మే నిందితుడని గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు బయటకొచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వర్మ బాహుబలి సినిమాలోని కొన్ని దృశ్యాలను ల్యాప్‌టాప్‌లోకి కాపీ చేశాడు.
ఆ తర్వాత వాటిని వాట్స్‌యాప్, ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు. అక్కడినుంచి నెట్లో అది హల్ చల్ చేసింది. మొత్తం 13 నిమిషాల నిడివి కలిగిన కీలక సన్నివేశాలను వర్మ కాపీ చేసి, ముందుగానే లీక్ చేసినట్లు తెలియడంతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే.