'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా' పాట టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్, సమంత స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్లు ఎవరూ మర్చిపోలేరు. తాజాగా ఈ పాటకు బాలీవుడ్ సెలబ్రిటీలు స్టెప్పులేశారు. స్టార్ హీరో అక్షయ్ కుమార్, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి స్టేజీపై ఊ అంటావా అంటూ అగ్గి రాజేశారు. యూఎస్ డల్లాస్‌లో వీరు ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చాలామంది నెటిజన్లకు వీరి డ్యాన్స్ నచ్చలేదు. ఊ అంటావా పాటను నాశనం చేశారు కదరా అంటూ సదరు హీరోహీరోయిన్లను ఏకిపారేస్తున్నారు.
'మీరు అల్లు అర్జున్, సమంతను మ్యాచ్ చేయడం కాదు కదా వారికి దరిదాపుల్లోకి కూడా రాలేరు..', 'వాటే వల్గర్ డ్యాన్స్..', 'ఇంత నీచంగా డ్యాన్స్ చేస్తున్నారేంట్రా దేవుడా', 'డ్యాన్స్ దాకా ఎందుకు అక్షయ్ ఎక్స్‌ప్రెషన్స్ ఒక్కటి చాలు ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి' అని కామెంట్లు చేస్తున్నారు. అయితే నోరా ఫ్యాన్స్ మాత్రం 'మా బ్యూటీ ఎంత బాగా స్టెప్పులేస్తుందో.. నిన్ను ఎవరూ బీట్ చేయలేరు నోరా' అని వెనకేసుకొస్తున్నారు. కాగా పుష్ప: ద రైజ్ సినిమాలో సమంత 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా' అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించి అదరగొట్టేసింది. మూడు నిమిషాల పాట కోసం ఆమె రూ.5 కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు భోగట్టా!
Comments
Please login to add a commentAdd a comment