Akshay Kumar Wears Skirt And Dance On Stage In Atlanta With Nora Fatehi, Goes Viral - Sakshi
Sakshi News home page

Akshay Kumar: గాగ్రా ధరించి హీరోయిన్‌తో చిందేసిన హీరో, వీడియో వైరల్‌

Mar 4 2023 4:55 PM | Updated on Mar 4 2023 5:30 PM

Akshay Kumar Wears Skirt and Dance on Stage in Atlanta - Sakshi

వెంటనే అతడు తన స్కర్ట్‌ విప్పేసి మరింత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ వేశాడు. ఇద్దరూ కలిసి స్టెప్పులేసిన ఈ వీడియో

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ యూఎస్‌ పర్యటనలో ఉన్నారు. నోరా ఫతేహి, దిశా పటానీ, మౌనీ రాయ్‌ సహా పలువురు సెలబ్రిటీలు 'ద ఎంటర్‌టైనర్స్‌ టూర్‌'లో భాగమయ్యారు. ఈ క్రమంలో అట్లాంటాలోని ఓ షోలో అక్షయ్‌ కుమార్‌ స్టేజీపై స్టెప్పులేశాడు. ఇటీవలే రిలీజైన 'సెల్ఫీ' చిత్రంలోని 'మే ఖిలాడీ..' పాటకు గాగ్రాలో చిందేశాడు.

ఇంతలో బ్యూటీ నోరా ఫతేహీ కూడా అతడితో జోడీ కట్టింది. ఇక సాంగ్‌ ఊపందుకుంటున్న సమయంలో అక్షయ్‌ తన స్కర్ట్‌ విప్పేసి మరింత ఎనర్జిటిక్‌గా డ్యాన్స్‌ వేశాడు. ఇద్దరూ కలిసి స్టెప్పులేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లుక్‌లో అక్షయ్‌ రెడ్‌ ఖిలాడీలా ఉన్నాడని, కాకపోతే స్కర్ట్‌తో కొంత ఇబ్బంది పడినట్లు కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా వీరి మాస్‌ పర్ఫామెన్స్‌కు అక్కడున్నవారు ఈలలు, చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. అటు అక్షయ్‌ కుమార్‌ భగవంతుని నామస్మరణతో ఈ టూర్‌ను ప్రారంభించగా అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. తన నెక్స్ట్‌ టూర్‌ డల్లాస్‌లోనేనని తెలియజేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement