న్యూఢిల్లీ: మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ అక్రమార్జన కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శుక్రవారం 6 గంటలపాటు ప్రశ్నించారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. ఈ కేసులో ఈడీ కూడా ఇప్పటికే ఫతేహిని ప్రశ్నించింది. ఆమెతో పాటు మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా సుకేశ్ నుంచి ఖరీదైన కార్లు, ఇతర వస్తువులను బహుమతిగా అందుకున్నట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో జాక్వెలిన్‌పై ఆగస్ట్‌లో ఈడీ కేసు కూడా నమోదు చేసింది. జాక్వెలిన్‌తోపాటు మరికొందరికి కూడా సమన్లు జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే తెలిపారు.
చదవండి: రూ.100 పేటీఎం లావాదేవీ.. రూ.6 కోట్ల దోపిడీ దొంగలను పట్టించింది!
సుకేశ్ చంద్రశేఖర్ కేసు.. నోరా ఫతేహిని 6 గంటలు ప్రశ్నించిన పోలీసులు
Published Sun, Sep 4 2022 7:24 AM | Last Updated on Sun, Sep 4 2022 9:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment