
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐటం సాంగ్స్‌లో తన స్టెప్పులతో కుర్రకారును అల్లాడిస్తుందీ భామ. సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ గతంలో వెయిటర్‌గా పని చేసిందట. తాజాగా ఈ విషయాన్ని ఓ రియాలిటీ షోలో వెల్లడించింది. కెనడాలో 16 ఏళ్లకే వెయిటర్‌గా పని చేశానని తెలిపింది నోరా. వ్యక్తిగత కారణాల వల్ల 18 ఏళ్లు వచ్చేదాకా వెయిటర్‌గా విధులు నిర్వర్తించానని పేర్కొంది.
వెయిటర్‌గా పని చేయాలంటే బాగా మాట్లాడగలిగే సామర్థ్యంతో పాటు, జ్ఞాపకశక్తి,, ఓపిక, సహనం కూడా ఉండాలంటోంది. కొన్నిసార్లు కస్టమర్లు నీచంగా ప్రవర్తిస్తారని, అలాంటప్పుడు పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో మనం స్వతాహాగా నేర్చుకోక తప్పదని చెప్పుకొచ్చింది. ఇక నోరా ఫతేహి సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరిసారిగా 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో నటించింది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడటంతో పాటు కీలక పాత్ర పోషించింది.
Comments
Please login to add a commentAdd a comment