పూరీ సమర్పించు.. సరికొత్త ఐటెం గాళ్ | puri jagannath introduces new item girl to tollywood | Sakshi
Sakshi News home page

పూరీ సమర్పించు.. సరికొత్త ఐటెం గాళ్

Published Wed, Oct 8 2014 12:07 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పూరీ సమర్పించు.. సరికొత్త ఐటెం గాళ్ - Sakshi

పూరీ సమర్పించు.. సరికొత్త ఐటెం గాళ్

ఐటెం సాంగులు తీయడంలో తనదైన ప్రత్యేకత కనబర్చే దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఈసారి మరో కొత్త ఐటెం గాళ్ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. ఈసారి మొరాకో దేశస్థురాలైన కెనడా మోడల్ను తెరమీదకు తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్ చేసే ఆమె పేరు నోరా ఫతేహి. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ జోరుగా సాగుతోంది. మళ్లీ ఎన్టీఆర్ తన బ్రాండు స్టెప్పులను ఈ పాటలో చూపిస్తాడని అంటున్నారు.

ఇంతకుముందు దేవుడు చేసిన మనుషులు చిత్రంలో 'డిస్ట్రబ్ చేస్తున్నాడే' పాటకు బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బెర్టాంటే, కెమెరామన్ గంగతో రాంబాబులో 'జొరమొచ్చింది.. దడపుట్టింది' పాటకు బ్రిటిష్ డాన్సర్ స్కార్లెట్ విల్సన్, హార్ట్ ఎటాక్లో దక్షిణాఫ్రికా మోడల్ నికోల్ అమీ మాడెల్... ఇలా పలువురు ఐటెం గాళ్స్ను తెలుగు తెరకు తీసుకొచ్చిన పూరీ.. ఇప్పుడు కెనడియన్ భామ నోరాను పరిచయం చేస్తున్నాడు.

ఎన్టీఆర్తో పూరీ చేస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. సినిమాలో ప్రస్తుతం పాట షూటింగ్ జరుగుతోంది. టాలీవుడ్లో నోరా ఫతేహి డాన్స్ చేయడం ఇదే తొలిసారి అయినా.. ఇప్పటికే హిందీ సినిమాలు రెండింటిలో ఆమె కాలు కదిపిందట. ఎన్టీఆర్ చిత్రం పూర్తయిన తర్వాత హిందీలో మరో పాటకు కూడా నర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement