ntr movie
-
బాలయ్య ఎన్టీఆర్‌కు పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
-
బాలయ్య ఎన్టీఆర్‌కు పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితంపై వివాదస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఎవరు ఏమన్నా.. సినిమా తెరకెక్కించి తీరుతానని తేల్చిచెప్పారు రాం గోపాల్ వర్మ. తాజాగా విజయ దశమి రోజు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రారంభించనున్నట్టు వర్మ ప్రకటించారు. కొత్త ఏడాది జనవరి చివరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. లక్ష్మి పార్వతి తన జీవితంలో ప్రవేశించడాని కంటే ముందే ఎన్టీఆర్ మరణించే వారని, కానీ ఆమె ఆయన జీవితంలోకి వచ్చాక, లక్ష్మీస్ ఎన్టీఆర్ జీవితం ప్రారంభమైందని తెలిపారు. తిరుపతిలో అక్టోబర్ 19న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముంబైకు చెందిన వ్యాపారవేత్త బాల గిరితో పాటు మరికొంతమంది అతిథులు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా, తండ్రి ఎన్టీఆర్ జీవితం కథలోనే తాను ప్రధాన పాత్ర పోషిస్తూ బాలకృష్ణ.. ఎన్టీఆర్ సినిమాను చేస్తున్నారు. ఆ సినిమాకు డైరెక్టర్ క్రిష్. బాలకృష్ణ, ఎన్టీఆర్‌గా చేస్తున్న ఆ సినిమాకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పడికప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్లను పోస్టు చేస్తూ.. చిత్ర బృందం ఆ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్‌కు పోటీగా వస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో కోణాన్ని వర్మ స్పృశిస్తున్నట్టు తెలుస్తోంది. -
కళ్యాణ్ రామ్ ఇన్.. ఎన్టీఆర్‌కి నో ఛాన్స్
తెలుగువారి ఆరాధ్య నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు దర్శకుడు తేజ ప్రయత్నాలు ప్రారంభించారు. సీనియర్ హీరో బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తూ.. మరోపక్క నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. మొన్నీమధ్యే అధికారికంగా లాంఛ్ అయిన చిత్రం గురించి ఇప్పుడు ఆసక్తికర అప్ డేట్ అందింది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ ఓ పాత్రలో కనిపించబోతున్నాడనేది ఆ వార్త సారాంశం. హరికృష్ణ పాత్రలోనే కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడన్నది వార్త. ఎన్టీఆర్ అధికారంలోకి రావటానికి ఎన్నికల సమయంలో చేపట్టిన చైతన్య రథం ఓ కారణం.ఆ రథాన్ని నడిపింది ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణే. దీంతో ఈ పాత్రకు కళ్యాణ్ రామ్ అయితేనే బావుంటుందన్న ఆలోచనతో ఆ నందమూరి హీరోను మేకర్లు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక చిత్ర లాంఛింగ్‌కు కళ్యాణ్ రామ్ హాజరుకావటం.. పైగా తన తండ్రి పాత్రే కావటంతో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు నారా రోహిత్, తారకరత్నలకు కూడా ఈ చిత్రంలో పాత్రలు దక్కాయని ఆ కథనం వివరించింది. అయితే ఈ ప్రాజెక్టు లాంఛింగ్ సమయంలో తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని మొన్నీమధ్యే ఐపీఎల్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇచ్చేశాడు. దీంతో ‘ఎన్టీఆర్’లో తారక్‌కు ఛాన్స్ దక్కే అవకాశం లేదన్నది తేలిపోయింది. మే నుంచి ఎన్టీఆర్ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుండగా.. దసరాకు చిత్రం విడుదల కానుంది. -
ఎన్టీఆర్ బయోపిక్‌పై స్పష్టత వచ్చేసింది
సాక్షి, సినిమా / విజయవాడ : ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఎట్టకేలకు స్పష్టత వచ్చేసింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘ఎన్టీఆర్’ చిత్రంలో సీనియర్ హీరో బాలకృష్ణ లీడ్ రోల్ పోషిస్తున్న విషయం విదితమే. ఈ నెల 29న చిత్రాన్ని లాంఛ్ చేయనున్నట్లు ఆయన నేడు మీడియాతో ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు కృష్ణా జిల్లా పామర్రు మండలం కోమరవోలు, ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు గ్రామాలలో త్వరలో బాలకృష్ణ పర్యటించారు. చిత్ర ముహూర్తానికి రావాలని ఆయా గ్రామల్లో ఉన్న తమ బంధువులను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్ తనయుడిగా ఆయన జీవిత చరిత్ర నటించటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో తొలిషెడ్యూల్ షూటింగ్ జరగనున్నట్లు తెలియజేశారు. ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే చిత్రమని, ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదని బాలయ్య స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా షూటింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఈ వీడియోని నమ్మకపోతే.. నరకానికే
-
సినిమా ఎలా తీయాలో తెలుసు: బాలకృష్ణ
-
సినిమా ఎలా తీయాలో తెలుసు: బాలకృష్ణ
విజయవాడ: తన నియోజకవర్గంలో టీడీపీలో ఎటువంటి విభేదాలు లేవని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పార్టీలో విభేదాలు సర్వసాధారణమని, చిన్న సమస్యలు ఏవైనా ఉంటే త్వరలో సర్దుకుంటాయని చెప్పారు. ఇకపై సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు. తన అల్లుడు నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్తు పార్టీ నిర్ణయిస్తుందన్నారు. లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకుంటారా, లేదా అనేది సీఎం చంద్రబాబు ఇష్టమని అన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తీసే సినిమాలో తానే హీరోగా నటిస్తానని తెలిపారు. సినిమా ఎలా తీయాలో, ఎక్కడ ముగించాలో తనకు తెలుసునని బాలకృష్ణ అన్నారు. కాగా, హిందూపురం పార్టీలో వివాదాలకు కారణమైన బాలకృష్ణ పీఏ శేఖర్‌ను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. -
పూరీ సమర్పించు.. సరికొత్త ఐటెం గాళ్
ఐటెం సాంగులు తీయడంలో తనదైన ప్రత్యేకత కనబర్చే దర్శకుడు పూరీ జగన్నాథ్.. ఈసారి మరో కొత్త ఐటెం గాళ్‌ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. ఈసారి మొరాకో దేశస్థురాలైన కెనడా మోడల్‌ను తెరమీదకు తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్ చేసే ఆమె పేరు నోరా ఫతేహి. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ జోరుగా సాగుతోంది. మళ్లీ ఎన్టీఆర్ తన బ్రాండు స్టెప్పులను ఈ పాటలో చూపిస్తాడని అంటున్నారు. ఇంతకుముందు దేవుడు చేసిన మనుషులు చిత్రంలో 'డిస్ట్రబ్ చేస్తున్నాడే' పాటకు బ్రెజిల్ మోడల్ గాబ్రియేలా బెర్టాంటే, కెమెరామన్ గంగతో రాంబాబులో 'జొరమొచ్చింది.. దడపుట్టింది' పాటకు బ్రిటిష్ డాన్సర్ స్కార్లెట్ విల్సన్, హార్ట్ ఎటాక్‌లో దక్షిణాఫ్రికా మోడల్ నికోల్ అమీ మాడెల్... ఇలా పలువురు ఐటెం గాళ్స్‌ను తెలుగు తెరకు తీసుకొచ్చిన పూరీ.. ఇప్పుడు కెనడియన్ భామ నోరాను పరిచయం చేస్తున్నాడు. ఎన్టీఆర్‌తో పూరీ చేస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. సినిమాలో ప్రస్తుతం పాట షూటింగ్ జరుగుతోంది. టాలీవుడ్లో నోరా ఫతేహి డాన్స్ చేయడం ఇదే తొలిసారి అయినా.. ఇప్పటికే హిందీ సినిమాలు రెండింటిలో ఆమె కాలు కదిపిందట. ఎన్టీఆర్ చిత్రం పూర్తయిన తర్వాత హిందీలో మరో పాటకు కూడా నర్తిస్తుంది.