తెలుగువారి ఆరాధ్య నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు దర్శకుడు తేజ ప్రయత్నాలు ప్రారంభించారు. సీనియర్ హీరో బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తూ.. మరోపక్క నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. మొన్నీమధ్యే అధికారికంగా లాంఛ్ అయిన చిత్రం గురించి ఇప్పుడు ఆసక్తికర అప్ డేట్ అందింది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ ఓ పాత్రలో కనిపించబోతున్నాడనేది ఆ వార్త సారాంశం.
హరికృష్ణ పాత్రలోనే కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడన్నది వార్త. ఎన్టీఆర్ అధికారంలోకి రావటానికి ఎన్నికల సమయంలో చేపట్టిన చైతన్య రథం ఓ కారణం.ఆ రథాన్ని నడిపింది ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణే. దీంతో ఈ పాత్రకు కళ్యాణ్ రామ్ అయితేనే బావుంటుందన్న ఆలోచనతో ఆ నందమూరి హీరోను మేకర్లు సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక చిత్ర లాంఛింగ్‌కు కళ్యాణ్ రామ్ హాజరుకావటం.. పైగా తన తండ్రి పాత్రే కావటంతో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు నారా రోహిత్, తారకరత్నలకు కూడా ఈ చిత్రంలో పాత్రలు దక్కాయని ఆ కథనం వివరించింది.
అయితే ఈ ప్రాజెక్టు లాంఛింగ్ సమయంలో తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని మొన్నీమధ్యే ఐపీఎల్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇచ్చేశాడు. దీంతో ‘ఎన్టీఆర్’లో తారక్‌కు ఛాన్స్ దక్కే అవకాశం లేదన్నది తేలిపోయింది. మే నుంచి ఎన్టీఆర్ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుండగా.. దసరాకు చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment