Nora Fatehi Reveals Her Beauty Secret And Tips For Glowing Skin, Deets Inside - Sakshi

Nora Fatehi: భోజనంలో అవి ఉండాల్సిందే! రోజూ ఆయిల్‌ మసాజ్‌.. నా బ్యూటీ సీక్రెట్‌ ఇదే!

Published Fri, Mar 17 2023 12:58 PM | Last Updated on Fri, Mar 17 2023 3:15 PM

Nora Fatehi Reveals Her Beauty Secret Tips For Glowing Skin - Sakshi

‘‘నీళ్లు బాగా తాగుతాను. రోజూ నా భోజనంలో తాజా ఆకు కూరలు, కూరగాయలు ఉండేలా చూసుకుంటాను. తాజా పండ్లు సరేసరి! వారానికి ఒకసారి ఫేస్‌కి గ్రీన్‌ టీ ప్యాక్‌ వేసుకుంటా. గ్రీన్‌ టీ ఆకులను తేనెలో కలిపి దాన్ని ఫేస్‌ ప్యాక్‌లా వేసుకుంటా.

ఆరిపోయాక చన్నీళ్లతో కడిగేసుకుంటా. ఇవన్నీకాక.. మొహం నిత్యం మెరుస్తూండడానికి నా చర్మానికి సరిపడే ఫేషియల్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుంటాను. గ్రీన్‌ టీ ప్యాక్, ఫేషియల్‌ ఆయిల్‌ మసాజ్‌లు మా అమ్మ చెప్పిన చిట్కాలే!’’ అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ నోరా ఫతేహీ. 

కాగా మొరాకో మూలాలున్న నోరా కెనడాలో జన్మించింది. మోడల్‌, డాన్సర్‌, సింగర్‌, నటిగా రాణిస్తోంది. 31 ఏళ్ల ఈ బ్యూటీక్వీన్‌ డాన్స్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. రోర్‌ మూవీతో తెరంగేట్రం చేసిన నోరా ఫతేహి.. హిందీతో పాటు తెలుగు, తమిళ​, మలయాళ చిత్రాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

పొలిటికల్‌ సైన్స్‌ అభ్యసించిన నోరా.. పేరుకు కెనడియన్‌ని అయినా ఆత్మీయత పంచడంలో భారతీయులకు ఏమాత్రం తీసిపోనంటూ పలు సందర్భాల్లో ఇండియాపై అభిమానం చాటుకుంది. ఇక దిల్‌ బర్‌ పాటలో నోరా స్టెప్పులకు ఫిదా కాని సినీ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులను అంతలా మాయ చేసింది ఈ సోగకళ్ల బ్యూటీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement