
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహీకి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.
చదవండి: మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళన అక్కర్లేదంటూ ఎమోషనల్ ట్వీట్
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ప్రస్తుతం నేను కరోనాతో పోరాడుతున్నా. నిజం చెప్పాలంటే ఈ వైరస్ నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గత కొద్ది రోజులుగా బెడ్‌కే పరిమితయ్యాను. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నా. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్కులు ధరించండి. వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరి వివిధ రకాలుగా ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ ప్రభావం నాపై తీవ్రంగా చూపించింది. ఇది ఎవరికైనా రావచ్చు.. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. జాగ్రత్తగా ఉండండి.. సురక్షితంగా ఉండండి ” అంటూ తెలియజేసింది నోరా ఫతేహి.
చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్, షణ్నూతో బ్రేకప్ తప్పదా?
Comments
Please login to add a commentAdd a comment