Jacqueline Fernandez Buys New House In Mumbai's Bandra - Sakshi
Sakshi News home page

Jacqueline Fernandez: కోట్ల రూపాయలతో ఇల్లు కొన్న టాప్‌ హీరోయిన్‌

Published Mon, Jul 3 2023 7:18 AM | Last Updated on Mon, Jul 3 2023 8:36 AM

Jacqueline Fernandez Buys New House In Mumbai - Sakshi

గత ఏడాదిలో సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు వెలుగుచూసినప్పటి నుంచి.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు మీడియాలో మార్మోగుతూనే ఉంది. తాజాగా ఆమె కొత్త ఇల్లు కొనడంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలోని కాస్ట్లీ ఏరియాలో జాక్వెలీన్ కొత్త ఇంటిని కొనింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్-ఆలియా భట్, కరీనా కపూర్,సైఫ్ అలీ ఖాన్ వంటి బడా హీరోలు నివసించే ప్రాంతంలో  'మర్డర్-2' బ్యూటీ కొత్త ఇంటిని తీసుకుంది.  

(ఇదీ చదవండి: వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్‌ ఆర్పీ)

ఇదే ప్రాంతంలో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూడా ఇల్లు కొనే  ప్లాన్‌లో ఉన్నారని తెలిసిందే. తాజాగా  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త ఇంటి వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉండే పాలి హిల్‌లో ఇంటిని కొనుగోలు చేసింది ఈ బ్యూటీ. వ్యాపారా నివేదికల ప్రకారం, ఈ ప్రాంతంలో 3 BHK, 4 BHK ఇళ్లు కొనాలన్నా రూ. 12 కోట్ల నుంచి మొదలవుతుంది. కానీ ఈ బ్యూటీ ఎన్ని బెడ్‌ రూమ్స్‌ ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు, ఎంత డబ్బు పెట్టి కొన్నారని ఇంకా తెలియరాలేదు. కానీ సుమారు రూ.  20 కోట్లతో  కొన్నట్లు ప్రచారం జరుగుతుంది.

జాక్వెలిన్ కొత్త ఇంటికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. నెటిజన్ల నుంచి పలు కామెంట్లు వచ్చాయి. సుకేష్ బహుమతిగా పంపించాడా అని ఒకరు ప్రశ్నిస్తే.. ఇదంతా సుకేష్ నుంచి వచ్చిన ప్రాప్తం అంటూ మరోకరు కామెంట్‌ చేశారు.  మరోకరు అయితే ఏకంగా 'సుకేష్ డబ్బుతోనా లేక సల్మాన్ భాయ్‌తోనా?' ఇని పలు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ఆమెకు బెమధ్యంతర బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. సుకేశ్ మాత్రం జైళ్లోనే ఉన్నాడు.

(ఇదీ చదవండి: జాక్వెలిన్‌కు కాకుండా నాటునాటుకు ఆస్కార్‌.. అసూయ వెల్లగక్కిన హీరోయిన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌)



(ఇదీ చదవండి: (Kajal Aggarwal: నెటిజన్‌ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన కాజల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement