John Abraham Calls Journalists As Dumb In Attack 1 Movie Press Meet: 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్ అబ్రహం నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఎటాక్'. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రత్న పాఠక్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది చిత్రబృందం. ఈ క్రమంలో జరిగిన ఓ మీడియా సమావేశంలో జాన్ అబ్రహం ఆగ్రహానికి లోనై రిపోర్టర్లపై విరుచుకుపడ్డాడు. ఈ సమావేశంలో ఒక జర్నలిస్ట్ జాన్‌ను మీ సినిమాల్లో యాక్షన్ ఓవర్ డోస్ ఉంటుంది. మీరు నలుగురైదుగురితో పోరాడుతుంటే బాగుంటుంది. కానీ మీరు ఒక్కరే 200 మందితో ఫైట్ చేయడం బైక్‌లను విసిరేయడం, మీ చేతులతో ఛాపర్‌లను ఆపడం వంటివి కొన్ని చూస్తే కొంచెం అతిగా అనిపిస్తూ ఉంటుంది. అని అన్నాడు.
చదవండి: ఇండియాస్ సూపర్ సోల్జర్‌పై 'ఎటాక్'.. అదరగొడుతున్న ట్రైలర్
దీనికి కోపగించుకున్న జాన్ 'మీరు దేని గురించి మాట్లాడుతున్నారు' అని ఆ జర్నలిస్ట్‌ను అడగ్గా.. 'సత్యమేవ జయతే' గురించి అని అతను బదులిచ్చాడు. అందుకు జాన్ అబ్రహం 'నేను ఎటాక్ సినిమా గురించి మాట్లాడుతున్నాను. మీకు దీంతో ఏమైనా సమస్య ఉంటే నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని నిజంగా బాధపెట్టాను.' అని వెటకారంగా సమాధానమిచ్చాడు జాన్. అనంతరం ఫిట్‌నెస్ గురించి అడిగిన ప్రశ్నకు 'శారీరకంగా ఫిట్‌గా ఉండటం కంటే కొందరు అడిగే పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో ప్రయత్నిస్తుంటాను. క్షమించండి సార్. మీరు మీ మెదడును ఇంట్లో వదిలేసి వచ్చినట్టున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున మిమ్మల్ని నేను క్షమాపణలు కోరుతున్నాను. పర్వాలేదు. మరోసారి బాగా ప్రయత్నించండి.' అంటూ వ్యంగంగా మాట్లాడాడు జాన్ అబ్రహం.
చదవండి: అదరగొడుతున్న సూపర్ సోల్జర్.. 'ఎటాక్' రెండో ట్రైలర్ రిలీజ్
Comments
Please login to add a commentAdd a comment