John Abraham Shocking Comments On Telugu And Regional Movies | Attack Movie Promotions
Sakshi News home page

John Abraham: ఎన్నటికీ తెలుగు, ప్రాంతీయ సినిమాల్లో నటించను

Published Wed, Mar 30 2022 4:04 PM | Last Updated on Thu, Mar 31 2022 1:16 PM

John Abraham Shocking Comments On Telugu And Regional Movies - Sakshi

John Abraham Comments On Telugu and Regional Movie: తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన తాజా చిత్రం ఎటాక్‌ ఏప్రిల్‌ 1వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మూవీ టీంతో కలిసి జాన్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్‌ అబ్రహం తెలుగు, ప్రాంతీయ సినిమాలపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. మూవీ ప్రమోషన్‌లో జాన్‌ అబ్రహం ఆయన అప్‌కమింగ్‌ సినిమాలపై స్పందించాడు.

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే, దక్షిణాది భాషలు మాత్రమే ఇక్కడ..

ఈ సందర్భంగా సలార్‌ మూవీలో ఆయన నటిస్తున్నట్టు వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు. అనంతరం తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఎలాంటి తెలుగు సినిమా చేయడం లేదు. నేను ఎప్పటికీ ప్రాంతీయ సినిమాలు చేయను. నేను ఓ హిందీ హీరోని. ఎన్నడు ఇతర భాషల్లో సెకండ్‌ హీరో, సహానటుడి పాత్రలు చేయను. ఇతర నటుల మాదిగా డబ్బు కోసం తెలుగు లేదా మరే ఇతర ప్రాంతీయ సినిమాల్లో నటింబోయే ప్రసక్తే లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌లో 'మల్లి' పాత్ర చేసిన చిన్నారి ఎవరో తెలుసా?

కాగా ప్రభాస్‌ హీరోగా తెరకెక్కితున్న పాన్‌ ఇండియా చిత్రం సలార్‌లో జాన్‌ అబ్రహం ఓ కీ రోల్‌ పోషించబోతున్నట్లు గతంలో జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అలాగే తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ పఠాన్‌ కోసం త్వరలోనే స్పెయిన్‌కు వెళుతున్నట్లు తెలిపాడు. పఠాన్‌ షూటింగ్‌లో భాగంగా తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని, త్వరలోనే ముంబై వచ్చి ఆ తర్వాత స్పెయిన్‌కు పయనమవుతాన్నాడు. జాన్‌ అబ్రహం లీడ్‌ రోల్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కిన ‘ఎటాక్‌’ మూవీలో జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్ సింగ్‌, ప్రకాష్‌ రాజ్‌, రత్న పాఠక్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ  సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement