అమ్మ, నాన్న అండ్ వైఫ్
⇒ ఇక్కడ వీడున్నాడు చూడండి.. నాన్న చంకలో.. జాన్ అబ్రహాం! బాలీవుడ్ యాక్టర్. నాన్న పక్కన ఉంది అమ్మ.
⇒ నాన్న మలయాళీ. అమ్మ పార్శీ.
⇒ వీడికి ఒంటి మీద బట్టల్లేకుండా పడుకోవడం అలవాటు. చైల్డ్‌హుడ్ అలవాటు కాదు. ఇన్ని కండలు పెంచాక.. ఇప్పుడు కూడా!
⇒ సినిమాల్లో అడ్డగాడిదలా రైడ్‌లు, నైట్ పార్టీలు అని తిరుగుతుంటాడు కానీ, లైఫ్‌లో చాలా డీసెంట్. నో క్లబ్స్, నో పార్టీస్. ఇక రైడ్స్ అంటారా.. పాపం వీడి బైక్.. పెళ్లయ్యాక (వీడికి పెళ్లయ్యాక) పెద్దమనిషి తరహాలోకి మారిపోయింది!
⇒ జాన్ అబ్రహాం అని కాకుండా వీడికి బాగా సూట్ అయ్యే ఇంకో పేరు ‘స్మైల్’. ఈ మాట మనం అనడం కాదు. అస్తమానం వీడితో దెబ్బలాడి మీద పడిపోతుండే బిపాషా బసు అనే మాట. ఇప్పుడు నో బిపాషా. ఓన్లీ ప్రియా రంచల్. వీడి భార్య (పైన రెడ్ షర్ట్‌లో). బిపాషతో చాలాకాలం క్రితమే బ్రేకప్ అయింది.
⇒‘స్మైల్’ (మనం కూడా ఇలాగే పిలుద్దాం) వెరీ సింపుల్. ఎక్కడికెళ్లినా కాళ్లకు స్లిప్పర్స్‌తోనే వెళ్తాడు. ఫ్రెండ్స్ తిడుతుంటారట.. ఆ స్లిప్పర్స్ మాని, షూ వేస్కోరా అని!
⇒ బైక్స్ అంటే ఇష్టం. ఫస్ట్ బైక్ 18 ఏళ్లప్పుడు కొన్నాడు. యమహా ఆర్.డి.350.
⇒ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడికెళ్లినా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే.
⇒ స్మైల్ అమ్మానాన్న కూడా చాలా సింపుల్. ఉద్యోగానికి నాన్న.. బస్‌లో వెళ్లొచ్చేవారు. అమ్మ.. ఆటోలో వెళ్లొచ్చేవారు.
⇒స్మైల్ నాన్న క్యాన్సర్ పేషెంట్. అమ్మ కేరింగే నాన్నను బతికించింది అంటాడు స్మైల్.
⇒ వీడి గురించి ఫైనల్‌గా ఇంకో మాట. ఒకప్పుడు స్మోకర్. అయితే ఆ పాడు అలవాటు చాలాకాలం క్రితమే వదిలేశాడు. గుడ్ బాయ్ అయిపోయాడు. (ఈ రోజు ఈ గుడ్‌బాయ్, ఈ స్మైలింగ్ బాయ్, ఈ సింపుల్ బాయ్.. బర్త్ డే! హ్యాపీ బర్త్‌డే రాకీ హ్యాండ్సమ్!!)