Bipasha
-
అమ్మ, నాన్న అండ్ వైఫ్
⇒ ఇక్కడ వీడున్నాడు చూడండి.. నాన్న చంకలో.. జాన్ అబ్రహాం! బాలీవుడ్ యాక్టర్. నాన్న పక్కన ఉంది అమ్మ. ⇒ నాన్న మలయాళీ. అమ్మ పార్శీ. ⇒ వీడికి ఒంటి మీద బట్టల్లేకుండా పడుకోవడం అలవాటు. చైల్డ్‌హుడ్ అలవాటు కాదు. ఇన్ని కండలు పెంచాక.. ఇప్పుడు కూడా! ⇒ సినిమాల్లో అడ్డగాడిదలా రైడ్లు, నైట్ పార్టీలు అని తిరుగుతుంటాడు కానీ, లైఫ్‌లో చాలా డీసెంట్. నో క్లబ్స్, నో పార్టీస్. ఇక రైడ్స్ అంటారా.. పాపం వీడి బైక్.. పెళ్లయ్యాక (వీడికి పెళ్లయ్యాక) పెద్దమనిషి తరహాలోకి మారిపోయింది! ⇒ జాన్ అబ్రహాం అని కాకుండా వీడికి బాగా సూట్ అయ్యే ఇంకో పేరు ‘స్మైల్’. ఈ మాట మనం అనడం కాదు. అస్తమానం వీడితో దెబ్బలాడి మీద పడిపోతుండే బిపాషా బసు అనే మాట. ఇప్పుడు నో బిపాషా. ఓన్లీ ప్రియా రంచల్. వీడి భార్య (పైన రెడ్ షర్ట్‌లో). బిపాషతో చాలాకాలం క్రితమే బ్రేకప్ అయింది. ⇒‘స్మైల్’ (మనం కూడా ఇలాగే పిలుద్దాం) వెరీ సింపుల్. ఎక్కడికెళ్లినా కాళ్లకు స్లిప్పర్స్‌తోనే వెళ్తాడు. ఫ్రెండ్స్ తిడుతుంటారట.. ఆ స్లిప్పర్స్ మాని, షూ వేస్కోరా అని! ⇒ బైక్స్ అంటే ఇష్టం. ఫస్ట్ బైక్ 18 ఏళ్లప్పుడు కొన్నాడు. యమహా ఆర్.డి.350. ⇒ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడికెళ్లినా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే. ⇒ స్మైల్ అమ్మానాన్న కూడా చాలా సింపుల్. ఉద్యోగానికి నాన్న.. బస్‌లో వెళ్లొచ్చేవారు. అమ్మ.. ఆటోలో వెళ్లొచ్చేవారు. ⇒స్మైల్ నాన్న క్యాన్సర్ పేషెంట్. అమ్మ కేరింగే నాన్నను బతికించింది అంటాడు స్మైల్. ⇒ వీడి గురించి ఫైనల్‌గా ఇంకో మాట. ఒకప్పుడు స్మోకర్. అయితే ఆ పాడు అలవాటు చాలాకాలం క్రితమే వదిలేశాడు. గుడ్ బాయ్ అయిపోయాడు. (ఈ రోజు ఈ గుడ్‌బాయ్, ఈ స్మైలింగ్ బాయ్, ఈ సింపుల్ బాయ్.. బర్త్ డే! హ్యాపీ బర్త్‌డే రాకీ హ్యాండ్సమ్!!) -
బిపాసా రొమాంటిక్ డేట్?!
గాసిప్ ప్రేమ వ్యవహారాల్లో యమా ఫాస్టుగా ఉంటుంది బిపాసా. అప్పుడే ప్రేమ అంటుంది, అప్పుడే బ్రేకప్ అంటుంది అని బాలీవుడ్లో చాలామంది కామెంట్ చేస్తుంటారు ఆమె గురించి. డినో మోరియా, జాన్ అబ్రహామ్లతో ప్రేమలో పడి విఫలమయ్యాక... మరెవ్వరికీ దగ్గర కాలేను, ఒంటరిగా ఉండటంలోనే ఆనందం ఉందనిపిస్తోంది అంటూ ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అయితే అంతలోనే మనసు మార్చుకున్నట్టుంది. ‘అలోన్’ చిత్రంలో తన సహ నటుడైన కరణ్ గ్రోవర్తో ప్రేమలో పడిందట బిప్స్. ఇప్పటికే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలో ఈ ఇద్దరూ స్విట్జర్లాండ్ టూర్ కూడా వెళ్లబోతున్నారని వినికిడి. -
బిపాసా.. హర్రర్!
భయపెట్టే పాత్రలంటే క్రేజో... మిగతా వాటి కంటే వాటిని నమ్ముకోవడమే మంచిదనో... మొత్తానికి సెక్సీ సుందరి బిపాసాబసు దెయ్యాల సినిమాల బాట పట్టింది. భూషణ్ పటేల్ ‘ఎలోన్’ చిత్రంలో ఇదే తరహా రోల్ ఒకటి చేస్తోంది. దానికి తోడు ఈ అమ్మడి మార్కు రొమాన్స్ ఉండనే ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్లో బిపాసా, కరణ్‌సింగ్ గ్రోవర్ల మధ్య కెమిస్ట్రీ తెగ వర్కవుటయిందని టాక్. అంతే కాదు... హర్మాన్‌కు కటీఫ్ చెప్పి బిపాసా... జెన్నీఫర్ వింగెట్‌కు డైవర్స్ ఇచ్చి కరణ్ ఒంటరైపోయారు. ‘ఎలోన్’ పుణ్యమాని... ఇద్దరూ ఒక్కటిగా తిరుగుతున్నారని గుసగుస. -
కత్రినా షేక్.. బిపాసా హాట్..
సిటీలో కాఫీలు, ఐస్‌క్రీమ్స్‌కు ఎలా రెగ్యులర్ బడ్డీస్ ఉన్నారో... మిల్క్షేక్లకూ అంతే ఉన్నారు. రెస్టారెంట్స్‌లో మెనూ తీసుకోగానే మిల్క్‌షేక్స్ ఏం ఉన్నాయా అని సెర్చ్ చేసేవారెందరో. అలాంటి మిల్క్‌షేక్ మేనియా ఉన్నవారి కోసం మాదాపూర్, శిల్పారామంలోని ఓరిస్ ఈట్మోర్ రెస్టారెంట్ సరికొత్త మెనూని సిద్ధం చేసింది. కత్రినా మ్యాంగో, హాట్ బడ్జ్ బిపాసా అంటూ బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లతో ఊరిస్తోంది. ‘‘ పేర్లు మాత్రమే కాదు టేస్ట్‌లోనూ మా మిల్క్‌షేక్స్ స్పెషల్’’ అని రెస్టారెంట్ మేనేజర్ హరి చెప్పారు. బ్లూ బియాన్స్, బెల్జియం చాక్లెట్ వంటి దాదాపు 8 రకాల మిల్క్‌షేక్స్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నామన్నారు. తమవి కేవలం మిల్క్ షేక్స్ మాత్రమే కావని ఇవి ‘థిక్ షేక్స్’ అని చెబుతున్న ఈ రెస్టారెంట్ ప్రతినిధులు... ఐస్‌క్రీమ్‌ని ఫుల్‌గా దట్టించిన వెరైటీలివని అంటున్నారు. -
సున్నదరీమణులు
సున్నా! ఆర్యభట్ట మెదడులో పుట్టి, అలియాభట్ ఒంటి మీద వాలింది. ఆరు నూరవ్వలేదు కానీ, సున్నా అయింది. ఎంతలా అంటే ‘సున్న’టి నడుము ఉంటేనే సన్నని నడుము అన్నట్టు అయ్యింది పరిస్థితి. ఇంతకీ అన్నం తినకుండా అందం పెంచుకోవడం అనే దాంట్లో ఎంత నిజముంది? ఈ బాడీ లెంగ్త్ ఫ్యాషన్ వెనక ఉన్న ట్రూత్ ఎంత? మిత్ ఎంత? తెలుసుకోవాలంటే... ‘టు ఆల్ ద గర్ల్స్... థింక్ యూ ఆర్ ఫ్యాట్ బికాజ్ యు ఆర్ నాట్ ఎ జీరో సైజ్, యూ ఆర్ ద బ్యూటిఫుల్ వన్, ఇట్స్ ది సొసైటీ హూజ్ అగ్లీ’... జీరో సైజ్ గురించి మార్లిన్ మన్రో అన్న మాటలివి. ‘అందం అంటే సన్నబడడం ఒక్కటే కాదు’ అని ఆవిడ ఉద్దేశం. జీరోసైజ్ ఫ్యాషన్ మన దేశానికి 2007లో వచ్చినా ఇది మొదలైంది మాత్రం 1960లోనే. లెస్లీ లాసన్, బ్రిజెట్ బార్డాట్. వీరిద్దరే మొట్టమొదట సైజ్ జీరో మోడల్స్. నాజూకైన ఒళ్ళు, గాజు లాంటి కళ్ళతో ఉన్న లెస్లీ లాసన్ని చూసి ముగ్ధులవ్వని వాళ్ళు లేరు అప్పట్లో. తర్వాత మోడల్స్ అందరూ ఈమె స్ఫూర్తితోనే తమని తాము సన్నపెట్టుకోవడం మొదలుపెట్టారు. చాలా డిజైనర్ కంపెనీలు, డిజైనర్లు కూడా జీరో సైజ్ సుందరాంగులు వేసుకుంటేనే, తమ దుస్తుల డిజైన్ అందం తెలుస్తుందని ఈ ఫ్యాషన్‌ని విపరీతంగా ప్రోత్సహించారు. ఒకానొక కాలంలో జీరో సైజ్ ‘తప్పనిసరి’ అని నిబంధనలు విధించిన రోజులు కూడా ఉన్నాయి. వివిధ రకాల ఆరోగ్యసమస్యల గురించి డాక్టర్లు ఎంత హెచ్చరించినా ‘జీరో’ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ క్రేజ్ మూలంగానే ‘లూయిసెల్ రామోర్’ అనే మోడల్ తన ప్రాణం పోగొట్టుకుంది. జీరో సైజ్ వల్ల వచ్చే ‘అనొరెక్సియా నెర్వోసా’ అనే డిజార్డర్‌తో ఆమె మరణించింది. ఈ దెబ్బతో ఈ ‘జీరో’ సైజ్ యూరప్ నుండి కనుమరుగవడం ప్రారంభించింది. కానీ అదే సమయంలో దాన్ని ఇండియాకి తీసుకొచ్చింది కరీనా! ‘తషన్’ చిత్రంలో 51 కేజీలు తూగిన కరీనా సన్నదనం చూసి స్టన్నయింది బాలీవుడ్. దీంతో మిగిలిన నటీమణులు కూడా క్యాలరీలు కట్చేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా కరీనా తర్వాత దీపికా పదుకొనె, బిపాసా, అనుష్క శర్మ, వీళ్ళంతా జీరో బాట పట్టినవారే. కానీ ఆ నాజూకుతనం భారతీయ మగ కంటికి అంత ఇంపుగా అనిపించక పోవడంతో జీరో సైజ్‌ని ఎంచుకునేవారి సంఖ్య జీరోకి చేరుకుంటోంది. ఎనరెక్సియా నెర్వోసా ఇది అత్యధిక మోడళ్ళలో కనపడే డిజార్డర్. తిండి తినడం వల్ల బరువు పెరుగుతుందనే ఫోబియా వల్ల వచ్చే రోగం ఇది. ఇది ఒక సాంఘిక అంటువ్యాధి.. నాకన్నా ఆ అమ్మాయి సన్నగా ఉందనే ఆత్మన్యూనతా భావంతో ఈ డిజార్డర్ బారిన పడుతుంటారు. ఇలా కొలతల గురించి కలత చెంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న మోడళ్ళు ఎందరో. ఫిజిక్స్ జీరో సైజ్ అంటే 30-20-30 అని అనుకుంటారందరూ. యూఎస్ సైజ్ రేంజ్ ప్రకారం 30-22-32 నుండి 33-25-35 మధ్య ఉండే మోడల్స్‌ని జీరో సైజ్‌గా పరిగణిస్తారు. ఇందులోనూ ‘0’, ‘00’ అని రెండు రకాలున్నాయి. రెండింటికి అర ఇంచు తేడా ఉంటుంది. ‘జీరో’ సైజ్ అనేది అందరి శరీర ఆకృతులకు సరిపోయేది కాదు. హైట్ టు వెయిట్ ఫ్యాక్టర్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్యాషన్‌ని అనుసరించాలి. అందుకే మరీ పొడుగు, పొట్టిగా ఉండే మోడల్‌లు ‘జీరో’ సైజ్‌కి ప్రయత్నించి విఫలమౌతున్నారు. ఎకనామిక్స్ బరువు తగ్గించుకోవడానికి వేలం వెర్రిగా మోడళ్ళు పరిగెత్తినా, వారి వెనక నుండి పరిగెత్తించి డబ్బులు చేసుకునేది మాత్రం డిజైనర్లే. అప్పట్లో, కేవలం సైజ్ జీరో మోడళ్ళను మాత్రమే ఎంచుకుని వారికోసం క్యాట్‌వాక్‌లు నిర్వహించేవి ఎన్నో ఫ్యాషన్ కంపెనీలు. హ్యాలీబెరీ, నటాలీ పోర్ట్మన్ లాంటి ఎందరో జీరో సైజ్ నటీమణులకు ఉన్న క్రేజ్‌ని చూసి వారికి తగ్గట్లుగానే దుస్తులు డిజైన్ చేయడం కూడా ఒక కారణం. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చినా... డబ్బు కూడా బాగా వస్తుందని ఎంత కష్టమైనా ఇష్టంగానే ఒళ్ళు కరిగించుకున్న మోడళ్ళు ఎందరో ఉన్నారు. బయాలజీ ఈ శరీరాకృతి సాధించడానికి చాలా పద్ధ్దతులున్నాయి. కానీ, ఆరోగ్యవంతమైనా పద్ధతులు చాలా తక్కువ. మగవాళ్ళు సిక్స్ ప్యాక్‌కి కష్టపడ్డట్టు, అమ్మాయిలు కూడా ‘జీరో’సైజ్‌కి అంతే కష్టపడాలి. ప్రత్యేకమైన డైట్లు, రోజువారీ ఎక్సర్సైజ్లు చేయాలి. ఇలా చేస్తే జీరో సైజ్ సాధించడానికి నెలల సమయం పడుతుంది. కానీ పోటీ తత్వం పెరగడంతో మోడళ్ళు షార్ట్‌కట్ రూట్లు వెతకడం వల్ల చాలా అనర్థాలే వచ్చాయి. కొందరు ఆహారం పూర్తిగా మానేసి కాఫీలు, సిగరెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు స్టెరాయిడ్స్ తీసుకుంటూ... జీరో సైజ్ యావలో లైఫ్‌ని జీరో చేసుకుంటున్నారు. - జాయ్