John Abraham's Attack Movie Part 1 Trailer Released - Sakshi
Sakshi News home page

Attack Movie: ఇండియాస్‌ సూపర్‌ సోల్జర్‌పై 'ఎటాక్‌'.. అదరగొడుతున్న ట్రైలర్‌

Published Mon, Mar 7 2022 5:34 PM | Last Updated on Mon, Mar 7 2022 5:47 PM

John Abraham Attack Movie Part 1 Trailer Released - Sakshi

John Abraham Attack Movie Part 1 Trailer Released: 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్‌ అబ్రహం నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'ఎటాక్‌'. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్ సింగ్‌, ప్రకాష్‌ రాజ్‌, రత్న పాఠక్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ  సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్‌ మూవీని ఏప్రిల్‌ 1న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఎటాక్‌ సినిమా మొదటి పార్ట్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 'జీవితంలో రెండు ముఖ్యమైన రోజులుంటాయి. ఒకటి మనం పుట్టిన రోజు. మరొకటి మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు' అంటూ ప్రారంభమైన ఈ మూవీ ట్రైలర్‌ ఆద్యంతం యాక్షన్‌ సీన్స్‌తో కట్టిపడేసింది. చాలా థ్రిల్లింగ్‌గా యాక్షన్‌ ఉంది. శశ్వాత్‌ సచ్‌దేవ్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ట్రైలర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది. యాక్షన్స్‌ సీన్స్‌లో జాన్‌ అబ్రహం అదరగొట్టాడు. ట్రైలర్‌ కట్‌ చేసిన విధానం వావ్‌ అనిపిస్తుంది. 

ఈ మూవీలో తీవ్రవాదాన్ని ఎదుర్కొనే సూపర్ సోల్జర్‌ పాత్రలో జాన్‌ అబ్రహం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఎటాక్‌ అనేది 'జాన్‌ అబ్రహం ఎంటర్‌టైన్‌మెంట్' సొంత స్వదేశీ కాన్సెప్ట్‌. కథకు తగినట్లుగా యాక్షన్ సన్నివేశాలు అసమానంగా ఉంటాయి. ఈ సినిమాలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ట్రైలర్‌లో వాటిని చూపించలేదు. ఎందుకంటే ఆ ట్విస్ట్‌లను వెండితెరపైనే చూడాలి.' అని నిర్మాతల్లో ఒకరైనా జాన్ అబ్రహం తెలిపాడు. అలాగే ఈ చిత్రం గురించి డైరెక్టర్ లక్ష్య రాజ్‌ 'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. అద్భుతమైన నటీనటులు, చిత్ర యూనిట్‌తో తెరకెక్కించాం. మేము పడిన కష్టాన్ని బిగ్‌ స్క్రీన్‌పై చూడనున్నారు.' అని పేర్కొన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement