
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, నటి నోరా ఫతేహీ, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఆయన భార్య ప్రియా రుంచల్ కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జాన్ అబ్రహం స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
చదవండి: ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు
చదవండి: విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి
‘కొద్ది రోజుల క్రితం నేను కలిసి ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా నాకు, నా భార్య ప్రియకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇటీవల మేమిద్దరం వ్యాక్సిన్ కూడా తీసుకున్నాం. అయినా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం మా ఆరోగ్యం బాగానే ఉంది. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి’ అని వెల్లడించాడు. అంతేగాక ప్రతి ఒక్కరూ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇటీవల కాలంలో తనని కలిసిన వారు వెంటనే టెస్ట్ చేసుకోవాలని, ఐసోలేషన్‌కు వెళ్లాలని జాన్ అబ్రహం సూచించాడు. కాగా ఇటీవల కాలంలో బీసీసీఐ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. పలువురు రాజకీయ నేతలు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు.