Priya Runchal
-
కరోనా కలకలం: స్టార్ హీరో దంపతులకు కోవిడ్ పాజిటివ్
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలపై ఈ మహమ్మారి తన పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అర్జున్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, నటి నోరా ఫతేహీ, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఆయన భార్య ప్రియా రుంచల్ కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని జాన్ అబ్రహం స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు చదవండి: విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి ‘కొద్ది రోజుల క్రితం నేను కలిసి ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా నాకు, నా భార్య ప్రియకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇటీవల మేమిద్దరం వ్యాక్సిన్ కూడా తీసుకున్నాం. అయినా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం మా ఆరోగ్యం బాగానే ఉంది. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి’ అని వెల్లడించాడు. అంతేగాక ప్రతి ఒక్కరూ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇటీవల కాలంలో తనని కలిసిన వారు వెంటనే టెస్ట్ చేసుకోవాలని, ఐసోలేషన్‌కు వెళ్లాలని జాన్ అబ్రహం సూచించాడు. కాగా ఇటీవల కాలంలో బీసీసీఐ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. పలువురు రాజకీయ నేతలు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. -
ప్రియాతో జాన్ పెళ్లి?
జాన్ అబ్రహాం వివాహం అతని ప్రేయసి ప్రియా రుంచల్‌తో జరిగిందా? ఔననే చెబుతోంది ట్విట్టర్లో అతను పోస్ట్ చేసిన ఓ వార్త. నూతన సంవత్సరం సందర్భంగా, ‘మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరికీ కలిసి రావాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రేమతో జాన్ మరియు ప్రియా అబ్రహాం’ అని ట్విట్టర్లో పెట్టారు జాన్. బిపాసా బసుతో దాదాపు తొమ్మిదేళ్లు సహజీవనం చేసి, ఆమె నుంచి ఆయన విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్ద గ్యాప్ లేకుండానే ప్రియా రుంచల్‌తో ప్రేమలో పడ్డారు జాన్. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ కొత్త సంవత్సరంలో ఒకింటివారయ్యారని జాన్ చేసిన ట్వీట్ చెబుతుంది. ఈ ట్వీట్లో ప్రియా రుంచల్‌ని ప్రియా అబ్రహాం అని జాన్ పేర్కొన్నారు కాబట్టి పెళ్లయ్యిందని ఫిక్స్ అవ్వొచ్చు. ఈ పెళ్లి ముంబై మహానగరంలో కాదు.. యూఎస్‌లో జరిగి ఉంటుంది. ఎందుకంటే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఇద్దరూ అక్కడికెళ్లారు. మరి.. ముంబై వచ్చిన తర్వాత పెళ్లి విషయాన్ని జాన్ అధికారికంగా ప్రకటిస్తారో లేక రహస్యంగా ఉంచేస్తారో చూడాలి. -
ఎట్టకేలకు ఓ ఇంటివాడైన జాన్ అబ్రహం!
ఎట్టకేలకు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఓ ఇంటివాడయ్యాడు. బిపాసా బసుతో విడిపోయాకా గత కొద్దికాలంగా మరో యువతితో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన వేడుకలో తన స్నేహితురాలు ప్రియా రాంచల్ ను జాన్ అబ్రహం వివాహం చేసుకున్నాడు. తన పెళ్లి గురించి స్వయంగా జాన్ అబ్రహం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు అని జాన్ అబ్రహం తెలిపారు. ప్రస్తుతం ప్రియాతో కలిసి జాన్ అబ్రహం అమెరికాలో పర్యటిస్తున్నారు. ముంబైలో ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేసే ప్రియా, జాన్ అబ్రహంల మధ్య ప్రేమ వ్యవహారం 2010 నుంచి నడుస్తోంది. గతంలో సుమారు 9 సంవత్సరాల పాటు బాలీవుడ్ తార బిపాసా బసుతో జాన్ రిలేషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహం దంపతులకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.