ప్రియాతో జాన్ పెళ్లి? | john abraham marriage with priya ? | Sakshi
Sakshi News home page

ప్రియాతో జాన్ పెళ్లి?

Published Sat, Jan 4 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

ప్రియాతో జాన్ పెళ్లి?

ప్రియాతో జాన్ పెళ్లి?

జాన్ అబ్రహాం వివాహం అతని ప్రేయసి ప్రియా రుంచల్‌తో జరిగిందా? ఔననే చెబుతోంది ట్విట్టర్‌లో అతను పోస్ట్ చేసిన ఓ వార్త. నూతన సంవత్సరం సందర్భంగా, ‘మీ అందరికీ శుభాకాంక్షలు.

 జాన్ అబ్రహాం వివాహం అతని ప్రేయసి ప్రియా రుంచల్‌తో జరిగిందా? ఔననే చెబుతోంది ట్విట్టర్‌లో అతను పోస్ట్ చేసిన ఓ వార్త. నూతన సంవత్సరం సందర్భంగా, ‘మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరికీ కలిసి రావాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రేమతో జాన్ మరియు ప్రియా అబ్రహాం’ అని ట్విట్టర్‌లో పెట్టారు జాన్. బిపాసా బసుతో దాదాపు తొమ్మిదేళ్లు సహజీవనం చేసి, ఆమె నుంచి ఆయన విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్ద గ్యాప్ లేకుండానే ప్రియా రుంచల్‌తో ప్రేమలో పడ్డారు జాన్. గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ కొత్త సంవత్సరంలో ఒకింటివారయ్యారని జాన్ చేసిన ట్వీట్ చెబుతుంది.
 
 ఈ ట్వీట్‌లో ప్రియా రుంచల్‌ని ప్రియా అబ్రహాం అని జాన్ పేర్కొన్నారు కాబట్టి పెళ్లయ్యిందని ఫిక్స్ అవ్వొచ్చు. ఈ పెళ్లి ముంబై మహానగరంలో కాదు.. యూఎస్‌లో జరిగి ఉంటుంది. ఎందుకంటే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఇద్దరూ అక్కడికెళ్లారు. మరి.. ముంబై వచ్చిన తర్వాత పెళ్లి విషయాన్ని జాన్ అధికారికంగా ప్రకటిస్తారో లేక రహస్యంగా ఉంచేస్తారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement