ఎట్టకేలకు ఓ ఇంటివాడైన జాన్ అబ్రహం!
ఎట్టకేలకు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఓ ఇంటివాడయ్యాడు. బిపాసా బసుతో విడిపోయాకా గత కొద్దికాలంగా మరో యువతితో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన వేడుకలో తన స్నేహితురాలు ప్రియా రాంచల్ ను జాన్ అబ్రహం వివాహం చేసుకున్నాడు. తన పెళ్లి గురించి స్వయంగా జాన్ అబ్రహం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు అని జాన్ అబ్రహం తెలిపారు. ప్రస్తుతం ప్రియాతో కలిసి జాన్ అబ్రహం అమెరికాలో పర్యటిస్తున్నారు. ముంబైలో ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేసే ప్రియా, జాన్ అబ్రహంల మధ్య ప్రేమ వ్యవహారం 2010 నుంచి నడుస్తోంది. గతంలో సుమారు 9 సంవత్సరాల పాటు బాలీవుడ్ తార బిపాసా బసుతో జాన్ రిలేషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. జాన్ అబ్రహం దంపతులకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.