
సౌత్ సినిమాలో జాన్ అబ్రహం
సాధారణంగా సౌత్ హీరోలు బాలీవుడ్లో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ధూమ్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం. ఆ తరువాత ఆ స్థాయిలో ఆకట్టుకునే సినిమాలు చేయలేకపోయినా బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్నాడు ఈ మ్యాన్లీ హీరో.
ప్రస్తుతం తానే నిర్మాతగా మారి రాకీ హ్యాండ్సమ్ పేరుతో ఓ యాక్షన్ సినిమాను తెరకెక్కించాడు. మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిషికాంత్ కామత్ దర్శకుడు. ఈ సినిమా సక్సెస్పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న జాన్, సౌత్లోనూ ఈ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే రీమేక్ చేయడం కన్నా డగ్ చేసి రిలీజ్ చేయటం బెటర్ అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై జాన్ అబ్రహం ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.