హర్మన్‌తో బిపాసా అఫైర్ | Will Bipasha Basu and Harman Baweja tie the knot? | Sakshi
Sakshi News home page

హర్మన్‌తో బిపాసా అఫైర్

Published Mon, Aug 11 2014 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

హర్మన్‌తో బిపాసా అఫైర్

హర్మన్‌తో బిపాసా అఫైర్

కండల వీరుడు జాన్ అబ్రహాంతో ప్రేమాయణం సాగించిన బాలీవుడ్ భామ బిపాసా బసు, ఇప్పుడు హర్మన్ బవేజాతో అఫైర్ సాగిస్తోంది. హర్మన్‌తో తనకు సంబంధం ఉన్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. అయితే, తానెప్పుడు స్థిరపడేదీ ఇప్పుడే చెప్పలేనని ఆమె అంటోంది. స్థిరపడటానికి తనపై తాను ఎలాంటి ఒత్తిడిపెంచుకోబోనని చెబుతోంది.
 
 దర్శకత్వం వైపు దియా మీర్జా చూపు
నటిగానే కాకుండా, నిర్మాతగానూ తనను తాను విజయవంతంగా నిరూపించుకున్న దియా మీర్జా, త్వరలోనే ఏదైనా సినిమాకు దర్శకత్వం కూడా చేయాలని ఉవ్విళ్లూరుతోంది. దర్శకత్వం చేయాలని తనకు ఎప్పటి నుంచో కోరికగా ఉందని, అయితే, ఎప్పుడు దర్శకత్వం వహించేదీ ఇప్పుడే చెప్పలేనని ఆమె చెబుతోంది. మంచి కథ దొరికితే దర్శకత్వం గురించి ఆలోచిస్తానని అంటోంది.
 
 పంజాబీ చిత్రంతో మళ్లీ తెరపైకి ధర్మేంద్ర
 నిన్నటితరం హీరో ధర్మేంద్ర సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెరపైకి వస్తున్నాడు. ‘డబుల్ ది ట్రబుల్’ పేరిట రూపొందుతున్న పంజాబీ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో పంజాబీ హీరో జిప్పీ గ్రీవల్ కూడా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఈ నెల 29న విడుదల కానున్న ఈ చిత్రంలోని ‘26 బన్‌గయీ’ పాట యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement