‘‘మహిళలకు పెద్ద పీట వేస్తూ.. విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు తీసేవారికి పెద్దగా ప్రోత్సాహమేమీ లభించడం లేదు’’. ఈ ఆవేదన జాన్ అబ్రహమ్‌ది. ‘‘నా దగ్గర స్త్రీ ప్రాధాన్యంగా సాగే రెండు కథలున్నాయి. కాని షూటింగ్ కోసం స్టూడియోలే దొరకట్లేదు. అలాంటి సినిమాలు ఆడవనే నమ్మకంతో స్టూడియోలను అద్దెకివ్వట్లేదు. అద్దె ఖర్చులూ రావనే భయమూ వారికి ఉన్నట్లుంది. ‘కాదు వాటిని అమ్మే పూచీ నాది’ అని స్టూడియో సిబ్బందిని కన్విన్స్‌చేసి సినిమా తీయడం గగనంగా ఉంది. మార్పు గురించి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కాని ప్రాక్టికల్‌గా ఇదో నిరంతరం యుద్ధం’’ అంటున్నాడు జాన్ అబ్రహం. సమాజంలో మిగతా మార్పుల కోసం మన ప్రయత్నాలు ఎలా ఉన్నా.. స్త్రీల విషయంలో మాత్రం పోరాటమే పెద్ద మార్పు. జాన్.. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. మీరు కోరుకున్న మార్పూ వచ్చి తీరుతుంది చూడండి.
Comments
Please login to add a commentAdd a comment