
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం హ్యాండ్‌సమ్ యాక్టర్. ఫీమేల్ ఫాలోయింగ్ కూడా చాలా ఉంది. చాలా మంది అమ్మాయిల క్రష్ ఈ హీరో. మరి మీకెప్పుడైనా ఎవరి మీదైనా క్రష్ ఏర్పడిందా? అని జాన్ అబ్రహాంని అడిగితే – ‘‘చిన్నప్పుడు మా స్కూల్ టీచర్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే తను అందంగా ఉండటంతో పాటు చాలా తెలివైనది. నా సెకండ్ క్లాస్ టైమ్‌లో తన మీద క్రష్ ఏర్పడింది. ‘మా క్లాస్ టీచర్ మిసెస్. ఆనంద్ అంటే నాకు చాలా ఇష్టం’ అని ఓ రోజు ధైర్యం చేసి మా నాన్నగారితో చెప్పేశాను. చిన్న వయసు కాబట్టి ఆయన ఏమీ అనలేదు’’ అని పేర్కొన్నారు జాన్ అబ్రహాం.