
జాన్ అబ్రహాం
బాలీవుడ్ యాక్షన్ హీరోల జాబితాలో జాన్ అబ్రహాం పేరు ముందు వరుసలో ఉంటుంది. వెండితెరపై యాక్షన్ హీరోగా ఆడియన్స్ చేత మంచి మార్కులు వేయించుకున్న జాన్ ఇప్పుడు మరో యాక్షన్ సినిమాతో వచ్చే ఏడాది బాక్సాఫీస్‌పై ఎటాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన నటించనున్న తర్వాతి చిత్రానికి ‘ఎటాక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ధీరజ్ వాధవన్, అజయ్ కపూర్‌లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు జాన్. ఈ సినిమాతో లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకునిగా పరిచయం కానున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది విడుదల చేయాలను కుంటున్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనలకు కల్పిత అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించ నున్నాం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎగై్జటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు జాన్ అబ్రహాం. ‘ఎటాక్’ చిత్రాన్ని ఓ ఫ్రాంచైజీలా కొనసాగించాలని టీమ్ భావిస్తోందని టాక్.
Comments
Please login to add a commentAdd a comment