
ఆయనే హాట్!
చూస్తుంటే బాలీవుడ్ రొమాంటిక్ క్వీన్ బిపాసాబసు టేస్ట్ చాలా డిఫరెంట్‌లా ఉంది. కండల వీరుడు జాన్ అబ్రహమ్‌తో చాన్నాళ్లు డేటింగ్‌లో మునిగితేలినా... టాలీవుడ్ ఆరడుగుల కుర్రాడు రానాతో ఫ్రెండ్‌షిప్ చేసినా... బీ-టౌన్‌లో హాటెస్ట్ మ్యాన్ మాత్రం డెబ్భై ఏళ్లు దాటినా ఇప్పటికీ అమితాబ్‌బచ్చనే అంటూ సెలవిచ్చి షాకిచ్చింది బిపాసా. తన ‘ఎలోన్’ చిత్రం ప్రమోషన్ కోసం ఓ టీవీ షోలో ఈ చిలిపి ప్రశ్న ఎదురైంది. ‘బచ్చన్ సర్‌కు పదికి పది. అలాగే అమ్మాయిల కలల రాకుమారుడు హృతిక్ రోషన్‌కు కూడా ఫుల్ మార్క్స్. హెయిరీ బాడీతో అలరించిన హీరో అనిల్‌కపూర్‌కు ఏడు మార్కులు‘ అని బిప్‌ను మరి మీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కు ఎన్ని అని అడిగితే... ‘కౌన్’ అంటూ ఎదురు ప్రశ్న వేసింది!