జాన్ అబ్రహం (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ యాక్షన్ హీరోల జాబితాలో జాన్ అబ్రహం పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘మద్రాస్ కేఫ్’, ‘సత్యమేవ జయతే’, ‘బాట్లా హౌస్’ వంటి వరుస హిట్లతో ఈ హీరో దూసుకపోతున్నాడు. అయితే గతంలో సినిమాలు తప్ప వేరే జోలికి వెళ్లని జాన్ అబ్రహం.. ఈ మధ్యకాలంలో రాజకీయ విషయాలను ప్రస్తావిస్తూ హాట్ టాపిక్‌గా మారాడు. బాలీవుడ్ వందశాతం సెక్యులర్ కాదని, పరిశ్రమ మతపరంగా చీలిపోయిందని, ఇది అక్షర సత్యమని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జాన్ పలు రాజకీయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు. కేరళ ఇంకా ఎందుకు మోదీ వశం కాలేదని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘దటీజ్ బ్యూటీ ఆఫ్ కేరళ’అంటూ సమాధానమిచ్చాడు. దీంతో అక్కడి వారంతో ఆశ్యర్యానికి గురయ్యారు. అంతేకాకుండా దానికి వివరణ కూడా ఇచ్చాడు.
‘కేరళలో ప్రతీ పది మీటర్లకొక టెంపుల్, మసీద్, చర్చిలు ఉంటాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా మతపరమైన గొడవలు జరగలేదు. జరగవు కూడా. ప్రపంచ వ్యాప్తంగా చూసినా అన్ని మతాల వారు ప్రశాంత వాతావరణంలో జీవించే రాష్ట్రం కేరళ మాత్రమే. అంతేకాకుండా చాలావరకు మలయాళీ ప్రజల్లో కమ్యూనిజం భావజాలం ఉంటుంది. ఉదాహరణగా చెప్పాలంటే క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో మరణించినపుప్పుడు ఒక్క కేరళ మినహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆయనకు సంబంధించిన ఫ్లేక్సీలు, నివాళులు అర్పించడం చూడలేదు. మా నాన్న ఎక్కువగా నన్ను కమ్యూనిజంకు సంబంధించిన విషయాలను తెలుసుకునేలా ప్రభావితం చేశారు. సమానత్వం, అందరికీ సమాన సంపద అనే వాటిని నమ్ముతున్నాం కాబట్టే కేరళ రోజురోజుకు అభివృద్ది చెందుతోంది’అంటూ జాన్ అబ్రహం పేర్కొన్నాడు.
ప్రస్తుతం జాన్ అబ్రహం వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు అబ్రహంకు మద్దతు నిలవగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. అబ్రహం చేసిన వ్యాఖ్యల్లో పెద్ద అంతరార్థమే దాగుందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి హవా నడిచినా.. కేరళలో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాగా, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ 19 స్థానాల్లో గెలిచి బలమైన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ మంగళ్’, జాన్ అబ్రహం ‘బాట్లా హౌస్’ చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అక్షయ్ చిత్రానికి ధీటుగా బాట్లా హౌస్ కలెక్షన్లను సాధించింది.
చదవండి:
బాలీవుడ్‌పై బాంబ్ పేల్చిన హీరో!
Comments
Please login to add a commentAdd a comment