
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వేదా. శార్వరి, అభిషేక్ బెనర్జీ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ విలేఖరి.. ఇందులో కొత్తగా ఏముంది.. మీరు ఎప్పుడూ చేసే యాక్షన్ మూవీలాగే ఉందని కామెంట్ చేశాడు. అతడి వ్యాఖ్యలపై జాన్ అబ్రహం మండిపడ్డాడు. నువ్వు సినిమా చూశావా? అని ప్రశ్నించాడు.
సినిమా చూశాక..
నీవన్నీ చెత్త ప్రశ్నలు.. ఇలాంటివి అడిగేవారందరూ తెలివితక్కువవారు అని నేనంటున్నానా? లేదు కదా.. ఇదొక డిఫరెంట్ మూవీ అని మీకు చెప్పాలనుకుంటున్నాను. యాక్షన్ సినిమాల కంటే ఇందులో నా నటన కొత్తగా ఉంటుంది. మీరింకా సినిమా చూడలేదు కాబట్టి తెలీదనుకోండి. కాబట్టి ముందు మూవీ చూడండి. తర్వాత ఏదైనా అనండి. అంతేకానీ ఇలా ముందుకుముందే తప్పుగా ప్రచారం చేస్తే మాత్రం అస్సలు సహించను అని వార్నింగ్ ఇచ్చాడు.
ఆగస్టు 15న రిలీజ్
నిఖిల్ అద్వాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. అదేరోజు స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే చిత్రాలు రిలీజవుతున్నాయి. తెలుగులో రామ్ పోతినేని - డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ - తంగలాన్, ప్రియదర్శి - 35: చిన్న కథ కాదు, నార్నే నితిన్ - ఆయ్: మేం ఫ్రెండ్సండి.. వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి బాక్సాఫీస్ ఫైట్ వద్ద ఏ మూవీ నిలదొక్కుకుంటుందో చూడాలి!
#JohnAbraham calls a journalist "Idiot" for asking a bad question at the #Vedaa trailer event. pic.twitter.com/CyqfXu5D11
— $@M (@SAMTHEBESTEST_) August 1, 2024
చదవండి: తెలుగు డైరెక్టర్ రెండు నెలలు తనతోనే ఉండాలన్నాడు: నటి